• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /సన్నగా ఉన్నామని సంబరపడకండి.. భారతీయులను కబళిస్తున్న లీన్ డయాబెటిస్.. అసలు ప్రమాదం ఎక్కడంటే?

సన్నగా ఉన్నామని సంబరపడకండి.. భారతీయులను కబళిస్తున్న లీన్ డయాబెటిస్.. అసలు ప్రమాదం ఎక్కడంటే?

Lean Diabetes:సాధారణంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి మాత్రమే మధుమేహం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే, సన్నగా, నాజూగ్గా ఉన్నంత మాత్రాన టైప్-2 డయాబెటిస్ బారిన పడకుండా తప్పించుకోలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Written ByBhoomi
Published: Nov 15, 2026, 13:04 IST|Updated: Nov 15, 2026, 13:06 IST
joinshare
సన్నగా ఉన్నామని సంబరపడకండి.. భారతీయులను కబళిస్తున్న  లీన్ డయాబెటిస్.. అసలు ప్రమాదం ఎక్కడంటే?
Image Credit: Lean Diabetes:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lean Diabetes: సాధారణంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి మాత్రమే మధుమేహం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే, సన్నగా, నాజూగ్గా ఉన్నంత మాత్రాన టైప్-2 డయాబెటిస్ బారిన పడకుండా తప్పించుకోలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చూడటానికి శరీర బరువు తక్కువగా కనిపించినప్పటికీ, పొట్ట చుట్టూ.. శరీరంలోని అంతర్గత అవయవాల వద్ద కొవ్వు (విసెరల్ ఫ్యాట్) పేరుకుపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని 'లీన్ డయాబెటిస్' (Lean Diabetes) అని పిలుస్తారు. సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కలిగి ఉండి, ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం మెండుగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో అంతర్గతంగా పేరుకుపోయే కొవ్వు కారణంగా ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరిగి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయని, అదే చివరకు లీన్ డయాబెటిస్‌కు దారితీస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. కాబట్టి కేవలం శరీర బరువును మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈ విషయంపై ఎండోక్రినాలజిస్ట్ మాట్లాడుతూ.. డయాబెటిస్‌ను నిర్ధారించడానికి BMI ఒక్కటే ప్రామాణికం కాదని అన్నారు. నడుము చుట్టుకొలత చాలా ముఖ్యం. అది మహిళల్లో 80 సెం.మీ కంటే, పురుషుల్లో 90 సెం.మీ కంటే ఎక్కువగా ఉంటే, దానిని ఒక ప్రమాద కారకంగా పరిగణించాలి. ఇతర దేశాలతో పోలిస్తే, భారతీయులు తక్కువ బరువు ఉన్నప్పటికీ డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన వివరించారు.

భారతీయులలో అధిక శరీర కొవ్వు శాతం, తక్కువ కండరాల బలం కారణంగా ఈ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర, నిశ్చల జీవనశైలి, ఫ్యాటీ లివర్, రక్తంలో అధిక ట్రైగ్లిజరైడ్స్ కూడా ప్రమాద కారకాలేనని ఆయన తెలిపారు.

ఈ లక్షణాలు     ఉంటే జాగ్రత్త: 
మీకు నిరంతర అలసట, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన,  దృష్టి మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మీ డాక్టర్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, HbA1c, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) వంటి పరీక్షలను సూచించే అవకాశం ఉంటుంది. కేవలం మీ బరువుపైనే కాకుండా, జీవక్రియ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.

Also Read: 

 

 

 

 

ఓపీఎస్ కోసం కదం తొక్కనున్న ఉద్యోగులు.. 17న సామూహిక సెలవు..!!

 

 

 

 

విద్యార్థుల పోరాటానికి దిగొచ్చిన తెలంగాణ సర్కార్.. పాలిటెక్నిక్ కళాశాలలు విద్యాశాఖలోనే కొనసాగింపు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Health
Telugu News