విటమిన్ ‘డి’ లోపిస్తే శరీరంలో కనిపించే హెచ్చరిక సంకేతాలివే.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..!!
Vitamin D: మారుతున్న జీవనశైలితోపాటు.. గంటల తరబడి నాలుగు గోడలకే పరిమితమై పనిచేయడం వంటి కారణాల వల్ల నేడు చాలామందిలో విటమిన్ డి లోపం తీవ్రమైన సమస్యగా మారుతోంది.
Vitamin D: మారుతున్న జీవనశైలితోపాటు.. గంటల తరబడి నాలుగు గోడలకే పరిమితమై పనిచేయడం వంటి కారణాల వల్ల నేడు చాలామందిలో విటమిన్ డి లోపం తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఎలాంటి తీవ్రమైన హెచ్చరికలు లేకుండానే ఇది నిశ్శబ్దంగా శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మన శరీరంలో ఎముకలు, కండరాలు దృఢంగా ఉండటానికి.. మనం తీసుకునే ఆహారం నుంచి కాల్షియంను సరిగ్గా గ్రహించడానికి విటమిన్ డి అత్యంత ప్రధానమైనది. అందుకే దీనిని సన్‌షైన్ విటమిన్ అని పిలుస్తారు. శరీరంలో ఈ విటమిన్ శాతం తగ్గితే అనేక రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
విటమిన్ డిలోపం ఉన్నవారిలో తరచుగా ఎముకల నొప్పులు, నడుము నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పనులకు అలసిపోవడం, నీరసంగా ఉండటం కూడా ఈ విటమిన్ లోపానికి సంకేతమే. సమస్య తీవ్రమైతే.. ఎముకలు పెళుసుబారి వాటి బలం తగ్గుతుంది. కొందరిలో ఎముకలు మెత్తబడే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.
విటమిన్ డి పొందడం ఎలా ఉంటే.. దీనికి ప్రధానమైన సూర్య రశ్మి సహజమార్గం. ప్రతి రోజూ ఉదయం కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు సురక్షితమైన సూర్యకాంతి శరీరానికి తాకే విధంగా చూసుకోవాలి. దీంతోపాటు కొన్ని ఆహార పదార్థాల ద్వారా కూడా విటమిన్ డి ని పొందవచ్చు. గుడ్డులోని పచ్చసొన, చేపలు, యూవీ కిరణాల ద్వారా పెంచిన పుట్టగొడుగులు, విటమిన్ డి బలవర్ధకం చేసిన పాలు, ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది.
పైన వివరించిన లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కలగవచ్చు. అందువల్ల.. మీకు విటమిన్ డి లోపం ఉందని మీరు అనుమానిస్తే.. సొంతంగా మందులు వాడకుండా నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. వారి సలహా ప్రకారం, లోపం తీవ్రతను నిర్ధారించడానికి మీరు రక్త పరీక్ష చేయించుకోవాలి. సప్లిమెంట్లను అవసరమైనప్పుడు మాత్రమే.. మీ వైద్యుడు సూచించిన మోతాదులో వాడాలి. ఎముకల ఆరోగ్యం మన శారీరక బలానికి పునాది కాబట్టి, విటమిన్ డి ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.
Also Read: