• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Cyclone Arnab Update: ఏపీలో అర్నబ్ తుఫాను ధాటికి తీవ్ర నష్టం..కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ!

Cyclone Arnab Update: ఏపీలో అర్నబ్ తుఫాను ధాటికి తీవ్ర నష్టం..కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ!

Cyclone Arnab Latest Update: ఆంధ్రప్రదేశ్‌లో 'అర్నబ్' తుఫాను తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ఈ తుఫాను ప్రభావం, జరిగిన నష్టం, చేపట్టిన సహాయక చర్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో పంటలు, రహదారులు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నాయని తెలుపుతూ, నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని సీఎం కోరారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం నివారించగలిగామని, ప్రస్తుతం పునరావాస, పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.

Written ByHarish Darla
Published: Oct 28, 2026, 12:41 PM IST|Updated: Oct 28, 2026, 12:46 PM IST
joinshare
Cyclone Arnab Update: ఏపీలో అర్నబ్ తుఫాను ధాటికి తీవ్ర నష్టం..కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
MPTC ZPTC Elections Postponement: ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం వేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా? ఎస్ఈసీ నిర్ణయం ఇదే!

MPTC ZPTC Elections Postponement: ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం వేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా? ఎస్ఈసీ నిర్ణయం ఇదే!

2

Tomato Price: ఏం జరుగుతోంది..? ఒకరోజు ఆకాశంలో.. మరుసటి రోజే పాతాళంలో టమోటా ధరలు..!

3

ఆధార్ కార్డ్‌లో మార్పులపై కొత్త రూల్స్.. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు UIDAI కీలక హెచ్చరిక!

4

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఇవి బంద్!

5

Cyclone Arnab Update: ఏపీలో అర్నబ్ తుఫాను ధాటికి తీవ్ర నష్టం..కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cyclone Arnab Latest Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరుచుకుపడిన అర్నబ్ తుఫాను తీవ్రత కారణంగా పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలోని తాజా పరిస్థితిని, జరిగిన ఆస్తి, పంట నష్టాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తుఫాను ధాటికి రాష్ట్రంలో భారీగా పంటలు నీటమునిగాయని, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన ముందస్తు చర్యల వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల నుండి సుమారు 28,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యల కోసం 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), 11 ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను నియమించి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రంతో పాటు వివిధ జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు 24/7 ప్రాతిపదికన నిరంతరం పనిచేస్తున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం తుఫాను వల్ల సుమారు 180 ఇళ్లు దెబ్బతిన్నాయి. అలాగే ప్రధాన రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయి. తీరప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా ధ్వంసమవ్వడంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ప్రజలకు తాగునీరు, సహాయక చర్యలు అందించడంతో పాటు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు.

ఈ వర్షాల వల్ల వ్యవసాయ, ఉద్యాన రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. దీనితో పాటు మరో 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని సీఎం తెలిపారు. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉందని లేఖలో వివరించారు.

రాష్ట్రంలో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తుఫాను వల్ల జరిగిన నష్టంపై సమగ్ర అంచనా వేసిన అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రాథమికంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వీలైనంత త్వరగా కేంద్ర అధ్యయన బృందాన్ని పంపాల్సిందిగా అమిత్ షాను కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిరంతరం అందిస్తున్న మద్దతుకు గానూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలియజేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP Weather
Rain News
Amit Shah
Chandrababu Naidu