Nara Lokesh tweet on raptadu victim girl health condition: ఆంధ్ర ప్రదేశ్ లోని అనంపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది హేమంత్ దాడిలో గాయపడ్డ బాలిక ప్రస్తుతం కొలుకుంటుంది. బెంళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గోపిక ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుంటుంది. బాలికకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లతో ఎప్పటికప్పుడు మంత్రి నారాలోకేష్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాలిక కుటుంబానికి తన పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఏ సమయంలో అయిన తనకు కాల్ చేయాలని ఇప్పటికే సూచించారు. మరోవైపు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారాలోకేష్ ట్విట్ చేశారు.
Update (9:30 AM, 5th November 2026): Relieved to share that Gopika is recovering well after yesterday’s right shoulder surgery (K-wire removal & proximal humerus plate fixation). She is stable, breathing comfortably without support, and slowly starting oral feeds. Glad to see her in high spirits and eager to walk today! Wishing her a speedy recovery.
— Lokesh Nara (@naralokesh) November 5, 2026
బాలికకు కుడి భుజంకు వైద్యులు సర్జరీ నిర్వహించారు. అదే విధంగా శస్త్ర చికిత్స విజయవంతమైందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బాలిక నార్మల్ ఫుడ్ తీసు కుంటుందని, ఆమె కుర్చీలో నుంచి నిలబడేందుకు ప్రయత్నిస్తుందని, లేచి నిల్చుంటుందని తెలిపారు. బాలిక ఆరోగ్యం తాము అనుకున్న దానికంటే తొందరగానే మెరుగు పడుతుందని వైద్యులు చెప్పారు. అతి తొందరలోనే ఆమె మాములు స్థితికి చేరుకుంటుందని వైద్యులు ప్రకటించారు.
గోపిక ఉత్సాహంగా ఉండటం, ఈ రోజు నడవడానికి ఆసక్తిని చూపించడం చాలా సంతోషంగా ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి నారాలోకేష్ ట్విట్ చేశారు. బాలిక గోపికతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడారు. అన్ని విధాలుగా తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.
కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇచ్చారు. ఇక రాప్తాడులో బాలికపై దాడి చేసిన ఉన్మాది హేమంత్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బుల్లెట్ గాయాల వల్ల ఇన్ఫెక్షన్ నేపథ్యంలో.. ఇప్పటికే అతని కుడి కాళ్లను వైద్యులు తీసేశారు. మరికొన్ని రోజుల్లో ఎడమ కాలును కూడా తీసేస్తారని చెబుతున్నారు.