• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Pulivarthi Sudha Reddy Warning: "ఈ రోజంతా నీతోనే ఉంటా" వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్..

Pulivarthi Sudha Reddy Warning: "ఈ రోజంతా నీతోనే ఉంటా" వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్..

Pulivarthi Sudha Reddy Warning Video: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతి రూరల్ ప్రాంతంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాన్వాయ్‌ను తెదేపా అభ్యర్థి జనరల్ ఏజెంట్ పులివర్తి సుధా రెడ్డి వెంబడిస్తూ, ఉద్రిక్తతలు సృష్టించవద్దని తీవ్రస్థాయిలో హెచ్చరించడం రాజకీయాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Written ByHarish Darla
Published: Nov 05, 2026, 01:29 PM IST|Updated: Nov 05, 2026, 01:32 PM IST
joinshare
Pulivarthi Sudha Reddy Warning: "ఈ రోజంతా నీతోనే ఉంటా" వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్..

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pulivarthi Sudha Reddy Warning Video: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి రూరల్ ప్రాంతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైకాపా నేతల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైకాపా అభ్యర్థికి జనరల్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లారు. ఈ క్రమంలో ఉదయం మంగళం ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని చెవిరెడ్డి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి.

మరోవైపు తెదేపా అభ్యర్థికి జనరల్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న పులివర్తి సుధా రెడ్డి (ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి) చెవిరెడ్డి ఉన్న పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. చెవిరెడ్డి కాన్వాయ్‌ను సుధా రెడ్డి తన వాహనంతో వెంబడించారు. ఉదయం నుంచి చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే, సుధా రెడ్డి కూడా అక్కడికే వెళ్లడం విశేషం.

ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఉద్దేశించి సుధా రెడ్డి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. తెదేపా నేతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని, అనవసరంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. "నేను నీకు ఎస్కార్ట్‌.. ఈ రోజు అంతా నీ వెంటే ఉంటాను అన్న. నిన్ను ఒంటరిగా వదిలేస్తే గొడవలు చేస్తావు. ఏమైనా నాన్సెన్స్ క్రియేట్ చేస్తే నీకు, నాకు నేరుగా ఉద్యమమే" అంటూ వ్యాఖ్యానించారు. రోజంతా ఆయన వెంటే ఉంటానని, అప్పుడే ఎలాంటి గొడవలు జరగవని ఆమె తెలిపారు.

అయితే చంద్రగిరి అధికార టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి. సుధా రెడ్డి వ్యవహరించిన ఈ తీరు తిరుపతి రూరల్ ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
TDP
YCP
Elections
Andhra Pradesh
Telugu News