SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

School Holiday: కొనసాగుతున్న సెలవుల పరంపర.. నేడు కూడా పాఠశాలలకు హలీడే!

School Holiday For Today On 25th September: ఏపీలో స్కూళ్ల సెలవులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజులు సెలవు ప్రకటించగా.. రేపు కూడా పలు జిల్లాల్లో సెలవు ప్రకటించారు. శుక్రవారం పాఠశాలలకు సెలవు ఇస్తూ స్థానిక అధికార యంత్రాంగం ప్రకటించింది.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 25, 2026, 05:58 AM IST | Updated: Sep 25, 2026, 06:03 AM IST
Image Credit: Today Schools Holiday In AP
Join

School Holiday For Today: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా విద్యార్థుల క్షేమం కోరి ఆయా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే రెండు రోజుల సెలవులు రాగా.. రేపు కూడా సెలవు ఇస్తూ స్థానిక అధికారులు ప్రకటించారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేపు అంటే శుక్రవారం పాఠశాలలకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడెక్కడో తెలుసా?

వర్షాలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఏపీలోని పోలవరం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. భారీ వర్షాల దృష్ట్యా నేడు అనగా 25వ తేది శుక్రవారం అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల విద్యా శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రికార్డు స్థాయి వర్షం
బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు నమోదైన వర్షపాతం  వివరాలు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యంత భారీ వర్షాలు కురిశాయని.. 80 ప్రాంతాల్లో 100మి మీకు పైగా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైందని తెలిపింది. ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. క్షేత్రస్థాయిలో అధికారులు హైఅలెర్ట్‌గా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

విశాఖ రూరల్ తులసీనగర్‌లో 236 మి మీ, మధురవాడలో 218 మి మీ, ఎండాడలో 210 మి మీ వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. సీతమ్మధారలో 205 మి మీ, కాపులుప్పాడలో 202 మి మీ, మహరాణిపేటలో 199 మి మీ అత్యధిక వర్షపాతం రికార్డు నమోదైంది.

విజయనగరం జిల్లా కొత్తవలసలో 188 మి మీ, విశాఖ పెందుర్తిలో 179 మి మీ, బుచ్చిరాజుపాలెం 171 మి మీ, పెదగంట్యాడలో 165మి మీ, కొత్తపాలెంలో 163 మి మీ వర్షపాతం నమోదు  

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేటలో 158 మి మీ, జలుమూరులో 150 మి మీ, కాకినాడ రూరల్ లో 148 మి మీ, తూర్పుగోదావరి జిల్లా గాడాలలో 146 మి మీ

పలు జిల్లాల్లో నమోదైన అతిభారీ వర్షాలు

కాకినాడ జిల్లా వేలంగిలో 142 మి మీ, జగ్గంపేటలో 140 మి మీ వర్షపాతం నమోదు

ఎన్టీఆర్ జిల్లా చంద్రాలో 133 మి మీ

కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 132 మి మీ,

విజయనగరం జిల్లా ఎల్. కోటలో 131 మి మీ

కృష్ణా జిల్లా బాపులపాడులో 124 మి మీ

ఏలూరు జిల్లా ఏదులగూడెంలో 122 మి మీ

పోలవరం జిల్లా దేవిపట్నంలో 121 మి మీ  వర్షపాతం రికార్డు

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES