SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vijayawada: ప్రియుడికి కోసం డ్రగ్స్ పెడ్లర్ గా మారిన యువతి.. అసలు విషయం తెలిస్తే షాక్ ..

Vijayawada Drug Arrest news: బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు యువతి డ్రగ్స్ తో వస్తుందని పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 15, 2026, 02:33 PM IST | Updated: Oct 15, 2026, 02:41 PM IST
Image Credit: Vijayawada woman drug woman news
Join

Woman arrested for drug smuggling over boyfriend bail in Vijayawada: ఇటీవల చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రేమించిన వారి కోసం కొంత మంది ఎలాంటి త్యాగాలైన చేసేందుకు రెడీగా ఉంటున్నారు. ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఎంతటి రిస్క్ అయిన కూడా చేస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా కొంత మంది క్రైమ్ లు కూడా చేస్తు తమ జీవితంను పణంగా పెట్టి మరీ ప్రేమించిన వారికోసం అండగా నిలుస్తున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది.

విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్య, కాశీవర్దన్ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొవాలని తమ కొత్త  జీవితంపై అనేక ఆశలుపెట్టుకున్నారు. కానీ ఇద్దరికి మాదక ద్రవ్యాల అలవాటు  ఉంది. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని ఈ మార్గంను ఎంచుకున్నారు. కాశీవర్దన్ సీక్రెట్ గా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి అమ్మి దానిలో ఇద్దరు విలాసవంతంగా జీవితం సాగించేవారు.  

ఈ క్రమంలో ఇటీవల  కాశీవర్ధన్ డ్రగ్స్ సరఫరా చేస్తు చిత్తూరులో అరెస్టయ్యాడు. అతను జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. ప్రియుడికి బెయిల్ ఇప్పించాలంటే  నాగసౌమ్య వద్ద లాయర్లకు ఇచ్చేందుకు అంత డబ్బులు లేవు. ఎలాగైన ప్రియుడ్ని విడిపించాలని తెగ ఆరాటపడింది. ఇక తన ప్రియుడిలానే తాను కూడా డ్రగ్స్ క్యారియర్ గా మారాలని ఫిక్స్ అయ్యింది. 
నాగసౌమ్య కొందరితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తూ కమిషన్ డబ్బులు కూడబెడుతుంది.

 ఈ క్రమంలో కృష్ణలంకకు చెందిన బషీర్ రూ.50 వేల కమిషన్ ఇస్తానని బెంగళూరుకు వెళ్లి  110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తెవాలని ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆమె బషీర్ చెప్పినట్లు బెంగళూరుకు వెళ్లి   110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో  బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు తిరిగొస్తుంది.

ఇంతలో పోలీసులకు యువతి డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి  నాగసౌమ్యను పట్టుకున్నారు.  ఆమె ప్యాంటులో, బ్యాగులో తనిఖీ చేయగా 110 గ్రాముల ఎండీఎంఏ లభ్యమైంది. వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు. 

మరోవైపు   బషీర్ ను సైతం పోలీసులు వలపన్ని విజయవాడలోనే అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో యువతి సైతం ప్రియుడిలాగానే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియుడి కోసం ఇలాంటి పనులు చేయడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES