Cyclone Murasu: తీవ్ర తుపానుగా మారిన మురసు.. తిరుపతిలో కురుస్తున్న వర్షం... భక్తులకు బిగ్ అలర్ట్.!.
Cyclone murasu in ap: తుపాను ప్రభావంతో తిరుపతిలో ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు పలు సూచనలు చేశారు.
Cyclone murasu effect heavy rain alert for Tirupati: ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికి అర్నబ్ తుపాన్ ప్రభావం నుంచి పూర్తిగా బైటపడలేదు. ఈ క్రమంలో మరో గండం ప్రస్తుతం ప్రజల్ని తీవ్రంగా కలవరపెట్టేదిగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారింది. దీనికి మురసు అని అధికారులు పేరు పెట్టారు. మరోవైపు తుపాన్ కాస్త అతితీవ్ర తుపాన్ గా మారింది. మురసు ప్రభావంతో తిరుపతిలో ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. వాతావరణం అంతా పూర్తిగా మురుసు పట్టినట్లుగా మారిపోయింది. వర్షంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా తుపాన్ కదలికలు మాత్రం ఏపీవైపుకు వేగంగా వస్తుందని వాతావరణ అధికారులు సూచించారు.
మురసు తుపాన్.. నెల్లూరుకు 120 కి.మీ., కావలికి 140 కి.మీ., తిరుపతికి 170 కి.మీ.ఒంగోలుకు 180 కి.మీ., బాపట్లకు 200 కి.మీల దూరంలో కేంద్రీకృతం అయి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ., గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఇప్పటికే మురసు తుపాన్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కోసం 6 ఎన్డీఆర్‌ఎఫ్, 7 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
ఇక తిరుమలకు వచ్చే భక్తులు సైతం భారీ వర్షాల అలర్ట్ తో తగు జాగ్రత్తలతో శ్రీవారి దర్శనానికి రావాలని అధికారులు, టీటీడీ పలు సూచనలు చేసింది. ఇక తిరుమలలో అర్నబ్ తుపాన్ ప్రభావంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గిపోయింది. సర్వదర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులకు కేవలం 6 గంటల్లోనే దర్శనం అవుతుంది. రూ. 300 టోకెన్లు ఉన్న వారికి 3 గంటల్లో దర్శనం అవుతుంది.తుపాన్ ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది.