SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..నవంబర్ నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు! ప్లాన్ చేసుకునే ముందు చూడండి!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 69,697 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 25,781 మంది తలనీలా సమర్పించారు. ఇక హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు వచ్చింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్‌ నెలకు సంబంధించిన విశేష పర్వదినాల జాబితాను కూడా విడుదల చేసింది. మీరు కూడా తిరుమల ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంటున్నట్లయితే ముందుగానే తెలుసుకుని ప్రయాణం చేయండి.

Written By Renuka Godugu
Published: Oct 27, 2026, 12:26 PM IST | Updated: Oct 27, 2026, 12:30 PM IST
Image Credit: TTD November Festival Calendar: (Image credits: TTD website)
Join

TTD November Festival Calendar: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం శ్రీవారి భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. అయితే, తిరుమలలో కొన్ని ప్రత్యేక రోజుల్లో విశేష ఉత్సవాలు కూడా జరుగుతాయి. నవంబర్‌ నెలలో కూడా జరిగే పర్వదినాలకు సంబంధించిన టీటీడీ ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి ముందుగానే భక్తులు తెలుసుకుని ప్లాన్‌ చేసి వెళ్లండి. తిరుమలలో నవంబర్‌ 2వ తేదీను నంబి ఉత్సవం జరగనుంది. 4వ తేదీ శ్రీ మనవాళ మహామునుల ఉత్సవారంభం కూడా నిర్వహిస్తారు. ఈయన ప్రముఖ వైష్ణవ, తెంకలై సంప్రదాయంలో చివరి ఆచార్యులు.

ఇక నవంబర్‌ 8వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. 11వ తేదీ తిరుమల నంబి శాత్తుమొర నిర్వహిస్తారు. అంటే తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో విశిష్ట ఆచార్యులైన తిరుమలనంబి. ఈయన నిత్య ఆకాశగంగ తీర్థంతో కైంకర్యం చేసిన మహాభక్తుడు. ఆయన్ను స్మరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శాత్తుమొర అంటే దివ్య ప్రబంధ పాశురాలను భక్తిశ్రద్ధలతో పఠించే ఘట్టాన్ని శాత్తుమొర అంటారు.

నవంబర్‌ 13వ తేదీ నాగుల చవితి రానుంది. ఈరోజు తిరుమలలో విశేష పర్వదినం శ్రీవారిని పెద్దశేష వాహనంపై విహరిస్తారు. ఇదే నెలలో 14వ తేదీ సేనైమొదలియార్‌ వర్ష తిరు నక్షత్రం, 15న శ్రీవారికి పుష్క యాగానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం నిర్వహిస్తారు. ఇక 16న పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం తదితర ఉత్సవాలు జరగనున్నాయి.

ఇక తిరుమలలో నవంబర్‌ నెలలో జరుగనున్న ఉత్సవాల్లో 19వ తేదీన యాజ్ఞవల్క్య జయంతి, 21న కైశిక ద్వాదశి వేడుకలు జరుపనున్నారు. 24వ తేదీ శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్‌ శాత్తుమొర, 25న తిరుప్పాణళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం ఉత్సవాలు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న అక్టోబర్‌ 26వ తేదీ ఒక్కరోజే శ్రీవారిని 69,697 మంది దర్శించుకున్నారు. ఇందులో తలనీలాలు 25,781 మంది సమర్పించారు. ఇక హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. ఇక నిన్న ఒక్కరోజే లడ్డూ విక్రయాలు 3.34 లక్షలు జరిగాయి.

Read Also: ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం!

Read Also: తిరుమల కొండపై వెలుగుల పండగ.. సూర్యప్రభపై శ్రీవారి భవ్య దర్శనం.. క్లిక్ చేసి చూడండి!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES