SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ఏకాదశి వేళ సేవ చేసుకునే వారికి టీటీడీ కీలక అప్ డెట్.!.

Vaikuta dwara darshan in Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినంను పురస్కరించుకుని టీటీడీ దర్శనాలు, శ్రీవారి పలు సేవలపై కీలక అప్ డెట్ ఇచ్చింది. ఈ క్రమంలో డిసెంబర్ మాసంకు సంబంధించిన ఆన్ లైన్ కోటాను ను 28.10.2026న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుందని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Written By Inamdar Paresh
Published: Oct 26, 2026, 02:32 PM IST | Updated: Oct 26, 2026, 03:39 PM IST
Image Credit: tirumala(file)
Join

Ttd key update on Vaikuta Ekadashi darshan slots: తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. ఇటీవల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. మరోవైపు  తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలపై ఏర్పట్లలో టీటీడీ నిమగ్నమైంది. దేశ వ్యాప్తంగా చాలా మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం  చేసుకొవాలని తాపత్రయపడుతాయి. అదే విధంగా పలు సేవలు కూడా చేయాలని భావిస్తారు. టీటీడీ సైతం సామాన్య భక్తులే తొలి ప్రాధాన్యతగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఈ క్రమంలో తిరుమలలో  డిసెంబర్ మాసంలో తిరుమలలో ఏకాదశి వేళ సేవలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల వైకుంఠ ఏకాదశి సేవా స్లాట్ లు మొత్తంగా ఐదు విడతల్లో ఉంటాయి. 

ఇవి 28.10.2026న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. మొత్తంగా ప్రతిస్లాట్   7 రోజుల పాటు ఉంటుంది. మొత్తంగా ఐదు రోజుల్లో ఏడుస్టాట్ లలో భక్తులకు శ్రీవారి సేవా భాగ్యంను టీటీడీ కల్పిస్తుంది. డిసెంబర్ 16 నుండి 22 వరకు, డిసెంబర్ 17 నుండి 23 వరకు, డిసెంబర్ 22 నుండి 28 వరకు, డిసెంబర్ 23 నుండి 29 వరకు & డిసెంబర్ 24 నుండి 30 వరకు సేవా స్లాట్ లను టీటీడీ ప్రకటించింది.

వైకుంఠ ఏకాదశి వేళ సేవా స్లాట్‌లకు వయోపరిమితి- 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు మాత్రమే అని టీటీడీ స్పష్టం చేసింది. ఆయా స్లాట్ లలో ఆన్ లైన్ లో సేవలకు బుక్ చేసుకున్న వారు సంబంధింత ప్రదేశంలోకి వెళ్లి క్యూలైన్ లో వేచి ఉండాలని టీటీడీ వెల్లడించింది.

మరోవైపు తిరుమలలో  సాధారణ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల యొక్క డిసెంబర్ 2026 నెలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటాను సైతం టీటీడీ 28.10.2026న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది.

రిపోర్టింగ్ రోజులు:-

సాధారణ సేవకులు తిరుపతి, తిరుమల రెండింటికీ తమ సేవా బుకింగ్ తేదీ నాటికే హాజరు కావాలి. తిరుమలలో వైకుంఠ ఏకాదశివేళ విపరీతమైన రద్దీ వేళ.. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి కారణంగా 2026 డిసెంబర్ 20 మరియు 21 తేదీలలో జనరల్, నవనీత, పరకామణి సేవకులకు వరుసగా దర్శనం ఉండదని టీటీడీ తెలిపింది.

 డిసెంబర్ 18 నుంచి 20 వరకు మూడు రోజుల కాలానికి కేటాయించిన పరకమణి కోటాను కూడా రద్దు చేశారు. పరకమణి సేవకులు తమ సేవా బుకింగ్ తేదీకి ఒక రోజు ముందుగా, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య తిరుమల సేవా సదన్ -2 లో హాజరు కావాలని, సేవకులకు ప్రొఫైల్ క్రియేషన్   సౌకర్యం కూడా అందుబాటులో ఉందని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES