SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఏడో రోజు మహాలక్ష్మి దేవిగా దుర్గమ్మ..

Dasara Festival Grand Celebrations: బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఏడో రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 17, 2026, 08:45 AM IST | Updated: Oct 17, 2026, 08:52 AM IST
Image Credit: Vijayawada Ammavaru (ZEE News Telugu/Source)
Join

Vijayawada Dasara Celebrations : విజయవాడ  దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడో రోజున శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి, ఆదిపరాశక్తి దుష్ట రాక్షస సంహారం చేసిందనీ, క్షీరాబ్ది పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి డోలాసురుడనే రాక్షసుడ్ని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి.


అమ్మవారిని అర్చిస్తే ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి..
రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ... గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మి భక్తులను అనుగ్రహిస్తుందని వేదపండితులు తెలిపారు. మహాలక్ష్మిని పూజించడం వల్ల దరిద్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మిక. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజ లక్ష్మిలుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణి మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకోవడం శుభప్రదం అన్నారు.

దేవి నామస్మరణతో మార్మోగుతున్న ఆలయ పరిసరాలు.. 
అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అర్చిస్తే ధన , కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ భక్తుల విశ్వాసం. ఇక రేపు దుర్గాష్టమి రోజున దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వనుంది. ఇక తొమ్మిదో రోజు మహిషాసుర మర్ధిని అవతారంలో భక్తులకు అభయం ఇవ్వనుంది. ఇక దసరా రోజున జరిగే హంస వాహన సేవతో ఉత్సవాలు ముగయనున్నాయి. మొత్తంగా తొలి రోజు నుంచి దసరా వరకు విజయవాడ, శ్రీశైలం సహా అమ్మవారు కొలువైన ఆలయాల్లో భక్తుల సందడితో కొలువుదీరనుంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES