• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /Arnab Cyclone Alert: విశాఖకు 870 కి.మీ దూరంలో సముద్రంలో అలజడి.. ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న 'అర్నాబ్' తుపాను..

Arnab Cyclone Alert: విశాఖకు 870 కి.మీ దూరంలో సముద్రంలో అలజడి.. ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న 'అర్నాబ్' తుపాను..

Arnab Cyclone Alert Andhra Pradesh: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇది దశలవారీగా బలపడి 'అతి తీవ్ర తుపాను'గా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, యానాం తీరప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, విపత్తు నిర్వహణ సంస్థ అధికార యంత్రాంగాన్ని, ప్రజలను, మత్స్యకారులను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది.

Written ByHarish Darla
Published: Oct 25, 2026, 11:01 AM IST|Updated: Oct 25, 2026, 06:05 PM IST
joinshare
Arnab Cyclone Alert: విశాఖకు 870 కి.మీ దూరంలో సముద్రంలో అలజడి.. ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న 'అర్నాబ్' తుపాను..

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AP New Vande Bharat Trains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రానికి మరో రెండు వందే భారత్ రైళ్లు!

AP New Vande Bharat Trains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రానికి మరో రెండు వందే భారత్ రైళ్లు!

2

RCB: వేలంలో బెంగళూరు జట్టు భారీ వ్యూహం.. వదులుకునే 7 మంది ఆటగాళ్లు వీరే?

3

Schools Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు స్కూళ్లకు సెలవు

4

ఎయిర్‌టెల్‌ ధమాకా ప్లాన్.. 56 రోజుల వాలిడిటీ, రోజుకు 3GB డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం!

5

వామ్మో.. యువకుడి ప్యాంటులోకి నాగుపాము.. ఏం చేశారో చూడండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Arnab Cyclone Alert Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తీరప్రాంతాల్లో అలజడి మొదలైంది. ఆదివారం ఉదయం 11:30 గంటల సమయానికి ఈ తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 870 కిలోమీటర్లు, కాకినాడకు 960 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,060 కిలోమీటర్లు, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ గంటకు 5 కిలోమీటర్ల నెమ్మది వేగంతో నైరుతి దిశగా కదులుతోంది.

దశలవారీగా బలపడనున్న తుపాను
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ తీవ్ర వాయుగుండం సోమవారం (అక్టోబర్ 26) ఉదయానికి తుపానుగా మారనుంది. అనంతరం అక్టోబర్ 27వ తేదీ ఉదయానికి తీవ్ర తుపానుగా.. అక్టోబర్ 28వ తేదీ ఉదయానికల్లా అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుంది. ఈ క్రమంలో అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం లోపు బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాల ముప్పు..
తుపాను తీరం దాటే కీలక సమయంలో తీరప్రాంతాల్లో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా తాకే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాలకు అధికారులు ఆరెంజ్ మెసేజ్ జారీ చేశారు.

విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలు
ఈ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తక్షణ ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వెళ్లిన వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని ఆదేశించింది. పడవలు, వలలను సురక్షిత ప్రదేశాల్లో కట్టి ఉంచాలని, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశమున్నందున బీచ్‌ల వద్ద సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయరాదని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

సహాయక చర్యలకు ప్రభుత్వ సన్నద్ధత
తుపాను కదలికలను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అధికారిక ప్రకటనలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Rain News
AP Weather
Visakhaptnam
Andhra Pradesh
Telugu News