SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. సిల్వర్ కిలోకు రూ.5 వేల మేర కిందకు..!!

Gold Rate: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.710 తగ్గి రూ. 1,41,980కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 తగ్గి రూ. 1,30,150 పలుకుతోంది.

Written By Bhoomi
Published: Nov 11, 2026, 11:13 AM IST | Updated: Nov 11, 2026, 11:14 AM IST
Image Credit: Gold Rate:
Join

Gold Rate: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.710 తగ్గి రూ. 1,41,980కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 తగ్గి రూ. 1,30,150 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ ధరలపై 3శాతం జీఎస్టీ అదనంగా ఉంటుందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.

ముఖ్యంగా వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే..  వెండి ధరలు భారీగా తగ్గాయి. కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న వెండి ధరలు, బుధవారం (నవంబర్ 11) నాడు మళ్లీ తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కిలో వెండి ధర సుమారుగా రూ. 4,700 మేర తగ్గింది. గుడ్ రిటర్న్స్ ప్రకారం, కిలోకు రూ. 5,000 తగ్గుదల నమోదైంది. ఇది వెండి కొనాలనుకునే వారికి కొంత ఊరటనిచ్చింది.

బుధవారం ఉదయం, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.1,82,450గా నమోదైంది. అంతకుముందు ముగింపు ధర రూ.1,87,127 కాగా, ఒక్క రోజులోనే ఇది రూ.4,677 మేర తగ్గింది. ఇది సుమారుగా 2.5శాతం తగ్గుదలను సూచిస్తుంది. దేశీయ వెండి ధరలను ట్రాక్ చేసే గుడ్ రిటర్న్స్ ప్రకారం, వెండి ధర కిలోకు రూ.5,000 మేర తగ్గి, రూ.2 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాలు, అమెరికన్ డాలర్ విలువలో మార్పులు, వడ్డీ రేట్లపై అంచనాలు వెండి ధరలను ప్రభావితం చేస్తాయి (వెండి ధర పతనం).

ఇదిలా ఉండగా, ఫ్యూచర్స్ మార్కెట్‌లో నమోదైన ధరలకు.. స్థానిక నగల దుకాణాలలో విక్రయించే వెండి ధరకు మధ్య వ్యత్యాసం ఉంది (నవంబర్ 11 వెండి రేటు). పన్నులు, మేకింగ్ ఛార్జీలు,  స్థానిక డిమాండ్‌ను బట్టి తుది ధర మారుతూ ఉంటుంది. అందువల్ల, కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ ధరలను నిర్ధారించుకోవడం ముఖ్యం. వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్నవారు ధరల హెచ్చుతగ్గులపై శ్రద్ధ వహించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కంటే, మార్కెట్ పరిస్థితులను బట్టి విడతల వారీగా కొనుగోలు చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.

Also Read: 

జాతీయ విద్యా దినోత్సవం.. IIT, UGCల వ్యవస్థాపకుడు ఆజాద్ ఆశయాలు నెరవేరుతున్నాయా?.. నేటి విద్యా వ్యవస్థ సవాళ్లు ఇవే..!!

విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES