SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బంగారం ధరల్లో ఊహించని మార్పు..తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే..!!

Gold Rateపసిడి కొనుగోలుదారులకు తీవ్ర నిరాశ కలిగిస్తూ గురువారం ఉదయం బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పసిడి ప్రియులకు ఊహించని షాక్ ఇస్తూ, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ. 2,900 మేర పెరుగుదల నమోదైంది.

Written By Bhoomi
Published: Nov 05, 2026, 09:12 AM IST | Updated: Nov 05, 2026, 09:14 AM IST
Image Credit: Gold Rate:
Join

Gold Rate : పసిడి కొనుగోలుదారులకు తీవ్ర నిరాశ కలిగిస్తూ గురువారం ఉదయం బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.  పసిడి ప్రియులకు ఊహించని షాక్ ఇస్తూ, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ. 2,900 మేర పెరుగుదల నమోదైంది. బుధవారం రూ. 1,39,910గా ఉన్న ధర, నేటి ఉదయానికి రూ. 1,42,810 మార్కును చేరుకుంది.

తాజా బులియన్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1, 30, 910 గా నమోదు అయ్యింది. అదే విధంగా 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1,07, 110 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి,  కాకినాడల్లోనూ ఇవే ధరలు అమలు అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపుగా ఒకే స్థాయిలో ఉన్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,42,960 కాగా, చెన్నైలో ఇది రూ. 1,42,920గా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో కూడా ధరలు హైదరాబాద్ మాదిరిగానే రూ. 1,42,810 వద్ద స్థిరంగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, ఇతర కారణాల వల్ల బంగారం, వెండి ధరలు తరచుగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఈ నేపథ్యంలో, ఆభరణాల కొనుగోలుదారులు లావాదేవీ జరిపే ముందు తాజా ధరలను సరిచూసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: 

వర్షాలు వర్షాకాలంలోనే ఎందుకు పడతాయి ? దీని వెనుక ఉన్న వాతావరణ రహస్యాలు మీకోసం..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES