Radhika Apte: పెద్దవయసు హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది.. బాలయ్య మూవీపై రాధికా ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలు..
Radhika apte on legend: అక్క వెబ్ సిరిస్ ప్రమోషన్లలో భాగంగా నటి రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ నెట్టింట దుమారంగా మారాయి. దీనిపై బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
Radhika apte controversy comments on Tollywood industry: టాలీవుడ్ ఇండస్ట్రీపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తీవ్ర విమర్శలు గుప్పించారు. కీర్తి సురేష్ తో కలసి అక్క వెబ్ సిరిస్ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాధికా ఆప్టే మాట్లాడుతూ..టాలీవుడ్ లో చేసిన పలు సినిమాల్లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని రివీల్ చేశారు. ఈ క్రమంలో.. గతంలో తాను ఒక పెద్ద వయసు హీరోతో కలిసి రొమాన్స్ చేయాల్సి వచ్చిందన్నారు. మరో మూవీలో సొంత కజిన్ ను పెళ్లి చేసుకునే పాత్రలో నటించాలని ఆఫర్ చేశారన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెల్లగా ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తారన్నారు.
ముఖ్యంగా హీరోయిన్లను ఎంపిక చేసే క్రమంలో తగినంత టాలెంట్ లేకున్న.. తెల్లగా ఉన్న వారికి ప్రయారిటీ ఇస్తారని బాంబు పేల్చారు. అయితే రాధికా ఆప్టే మాటల్ని బట్టి గతంలో ఈ భామ బాలయ్యతో కలిసి నటించి లెజెండ్ మూవీ గురించి అని నెట్టింట రచ్చ మొదలైంది. రాధికా ఆప్టే బాలయ్యతో కలసి లెజెండ్, లయన్ సినిమాల్లో నటించారు.
ఆ సమయంలో..బాలయ్యకు 54 కాగా, రాధిక ఆప్టేకు 29. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం రాజుకుంది. ఈ క్రమంలో రాధికా ఆప్టే బాలయ్యతో కలసి మూవీలో నటించినప్పుడు ఈ విషయం తెలియలేదా అంటూ బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. టాలీవుడ్లో చాన్స్ లు పొంది మంచి ఫెమ్ వచ్చాక.. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.