Adarsha Kutumbam Movie Review:‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ మూవీ రివ్యూ.. వెంకటేష్, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అయిందా..!!
Adarsha Kutumbam Movie Review: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47’ (AK 47). శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నారా రోహిత్ మరో ముఖ్యపాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించారు. హారికా అండ్ హాసికా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను చినబాబు నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
మూవీ రివ్యూ: ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 (Adarsha Kutumbam House No 47 - AK 47)
నటీనటులు: వెంకటేష్, నారా రోహిత్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు
సంగీతం: తమన్ ఎస్.ఎస్.
సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్
ఎడిటర్: నవీన్ నూలి
సమర్పణ: శ్రీమతి మమత
బ్యానర్: హారికా అండ్ హాసిని క్రియేషన్స్
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల తేది:30-10-2026
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. హౌస్ నెం.47 - AK 47. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు మాటల రచయతగా పనిచేసిన త్రివిక్రమ్.. 22 యేళ్ల తర్వాత వెంకటేష్‌ను డైరెక్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సహా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
బిహార్ కు చందన్ (ఉదయ్ బీర్ సంధు దురంధర్ ఫేమ్) అతని గ్యాంగ్ ధనవంతులను టార్గెట్ చేసి వాళ్ల ఇంట్లో పనివాళ్లుగా చేరి అదును చూసి ఆయా కుటుంబాలను హత్య చేసి ఇంట్లో ఉన్న సొమ్మును దోచుకునే బిహార్‌కు చెందిన క్రిమినల్ గ్యాంగ్. మరోవైపు ఒక పూట తింటే ఇంకో పూటకు లాటరీ కొట్టే చిట్టిబాబు (వెంకటేష్)కు భూటాన్ లాటరీలో అనుకోకుండా రూ. 100 కోట్ల లాటరీ వస్తోంది. దీంతో వారి కుటుంబం గురించి నగరమంతా హోర్డింగులు పెట్టి హంగామా చేస్తారు లాటరీ వాళ్లు. దీంతో బిహార్ గ్యాంగ్ కన్ను ఈ కుటుంబంపై పడుతుంది. ఓ గేటెట్ కమ్యూనిటీలో హౌస్ నెం 47లో ఉంటున్న వారి ఇంట్లో ఈ గ్యాంగ్ కు సంబంధించిన వాళ్లు వంట పని, కారు డ్రైవర్‌గా పనికి కుదురుతారు. ఇక లాటరీ డబ్బు వాళ్ల ఇంటికి వచ్చిందని తెలుసుకున్న బిహార్ గ్యాంగ్ వాళ్ల పై ఎటాక్‌కు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఏం జరిగింది. తన కుటుంబాన్ని చంపడానికి వచ్చిన బిహార్ గ్యాంగ్‌ను చిట్టిబాబు ఎలా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. అసలు చిట్టిబాబు గతం ఏంటి.. ? చిట్టిబాబుకు అర్జున్ ప్రసాద్‌కు ఉన్న లింకేంటి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ సినిమా కథను రాసుకున్నాడు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొంత మంది డబ్బున్న వాళ్ల ఇళ్లల్లో వాచ్‌మెన్‌గా.. డ్రైవర్‌గా..పనిచేస్తూ అదను చూసి ఆ కుటుంబాన్ని అంత చేయడం వంటి సంఘటనలు ఈ మధ్య చాలానే వచ్చాయి. వాటి గురించి మీడియాలో కూడా బాగానే చర్చనీయాంశంగా మారాయి. అలాంటి గ్యాంగ్ బిహార్‌లోని గయా నుంచి ఘజియాబాద్ మధ్య ఉన్న ఊరులో ఉంటుంది. వాళ్లు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర ఒక్కో రాష్ట్రంలో క్రైమ్ చేస్తూ తెలంగాణను టార్గెట్ చేస్తారు. ఒక రాష్ట్రంలో క్రైమ్ చేసి ఆ రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రంలో క్రైమ్ చేయడం.. ఇలా ఒక్కొక్క రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుంటూ పోతుంటారు. ఈ నేపథ్యంలో క్రైమ్ కథను అల్లుకోవడంలో తివిక్రమ్ మార్క్ కనబడింది. ఒక హిందీ పాట, కొన్ని డైలాగులు హిందీలో ఉండటం నైజాంతో పాటు హైదరాబాద్ సిటీ ప్రేక్షకులు అర్ధం చేసుకోగలిగినా.. శ్రీకాకుళం, రాయలసీమ వంటి జిల్లాల ప్రజల ఏ మేరకు అర్ధం అవుతాయనేది చూడాలి.
అయితే వీటిని వెంకటేష్‌తో తను చేసిన మాయతో అదంతా మర్చిపోయేలా చేశాడు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందనేది స్వయంగా అనుభవించిన త్రివిక్రమ్.. ఇందులో ఆయా డైలాగులను హీరో చెప్పించిన విధానం బాగుంది. హీరోకు భూటాన్ లాటరీ తగలడం.. దాంతో బిహార్ గ్యాంగ్ కన్ను హీరో ఇంటిపై పడుతుంది. హీరో ఇంటికి వచ్చిన బిహార్ గ్యాంగ్‌ను చిట్టిబాబు ఫ్యామిలీ ఎలా ఊచకోత కోసింది. పోలీసులకు చనిపోయిన వాళ్ల ఆనవాళ్లు కనపడవు. దీంతో వాళ్లను క్రిమినల్స్‌గా పట్టుకోవాలని ప్రయత్నించడం వంటివి సిల్లీగా అనిపిస్తాయి. ఆ తర్వాత ఆదర్శ కుటుంబంగా చెబుతున్న వీళ్ల ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అది రివీల్ చేస్తే చూసే ప్రేక్షకులకు మజా ఉండదు.
ఇక వెంకటేష్, రఘుబాబు, సత్యల మధ్య వచ్చే కామెడీ బాగానే పేలింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయినా.. సెకండాఫ్‌లో ఏం చేయాలో తెలియక త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ అయ్యాడు. ఓవరాల్‌గా తన డైలాగులతో వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో లాక్కొచ్చాడు. మరోవైపు వెంకటేష్, శ్రీనిధి శెట్టిలతో పాటు హీరో కూతురు, కుమారుడు చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తాయి. కొంచెం రక్తపాతం ఉన్నా.. కుటుంబాన్ని రక్షించుకోవడానికి హీరో ఆ మాత్రం నరికినా.. తప్పులేదనే కన్విన్సింగ్ చేసే ప్రయత్నం చేసాడు. మరోవైపు పోలీస్ ఆఫీసర్స్ అయిన రావు రమేష్, బ్రహ్మాజీ ఎలా ఈ ఆదర్శ కుటుంబాన్ని ఎలా వాడుకున్నారు. రావు రమేష్‌తో చెప్పించిన డైలాగులు బాగున్నాయి. ఇక విలన్ గ్యాంగ్‌కు హీరో మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చూపెట్టాడు. తమన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సినిమాలో కార్తి నటించిన ‘ఖాకీ’తో పాటు పోకిరి లాంటి కొన్ని ట్విస్టులున్నాయి. ఎడిటర్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. సీన్స్ రాసుకున్నా విధానం బాగున్నా.. ఇంకాస్త ఎఫెక్ట్‌గా ఉంటే మరింత బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్‌గా ఫ్యామిలీ ప్రేక్షకులు కోరుకునే కామెడీతో పాటు మాస్ ఆడియన్స్ కోరుకున్న క్రైమ్, యాక్షన్ బాగానే వర్కౌట్ చేశాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ మాటల మంత్రజాలం కొనసాగింది. గొప్పవాళ్లకు జీవితం అంతా ఆగ్రహం.. పోయాకా విగ్రహం.. అక్క ఏమో అగరబత్తిలా ఉంది.. మీరేమో కొవ్వొత్తిలా ఉన్నారు. ఇలాంటి డైలాగులు బాగానే థియేటర్స్‌లో పేలాయి. మొత్తంగా లాజిక్కు ను పక్కన పెట్టి డార్క్ కామెడీ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా అలరిస్తుందనే చెప్పాలి.
నటీనటుల విషయానికొస్తే..
వెంకటేష్ మరోసారి మిడిల్ క్లాస్ మ్యాన్‌గా అదరగొట్టాడు. తన మార్క్ కామెడీ చేస్తూనే యాక్షన్ సీన్స్‌లో రాణించాడు. శ్రీనిధి శెట్టి నటనకు అవకాశం ఉన్న పాత్రలో బాగానే నటించింది. వెంకీ కూతురు పాత్రలో నటించిన వాళ్లు బాగానే చేశారు. బిహార్ గ్యాంగ్ లీడర్ చందన్ పాత్రలో దురంధర్ ఫేమ్ ఉదయ్ బీర్ సంధు తన మార్క్ నటనతో భయపెట్టాడు. దురంధర్ హీరో బామ్మర్ది పాత్రలో డ్రగ్స్ పెల్లర్గా నటించిన ఇతనికి ఈ సినిమాలో విలన్‌గా మంచి క్యారెక్టరే దొరికింది. ఇక చందన్ గ్యాంగ్ బడా భాయ్ గా నికితన్ ధీర్ తన ఆహార్యంతో ఆకట్టుకున్నాడు. షఫీతో పాటు బిహార్ గ్యాంగ్‌లో నటించిన వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. నారా రోహిత్ .. తన పోలీస్ ఆఫీసర్ దామోదర్ నాయుడు పాత్రలో సెలెక్టివ్ పర్ఫమెన్స్ చేశాడు. రావు రమేష్ కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన మార్క్ యాక్టింగ్‌లో త్రివిక్రమ్ డైలాగులను బాగానే వల్లెవేశాడు. ఇక సత్య, రఘుబాబులు తెరపై ఉన్నంత సేపు ప్రేక్షకులను కితకితలు పెట్టారు.నివేదా పేతురాజ్ క్యారెక్టర్ ఏదో కూరలో కరివేపాకు టైపు ఉంది. ఏదో ఒక పాట మినహాయిస్తే పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. డింపుల్ హయతి ఓ పాటకే పరిమితమైంది.
ప్లస్ పాయింట్స్..
వెంకటేష్ కామెడీ టైమింగ్
త్రివిక్రమ్ డైలాగులు
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్
లాజిక్ లేని సీన్స్
పంచ్ లైన్.. ‘ఆదర్శ కుటుంబం’ .. ఓ మోస్తరుగా మెప్పించే ఫ్యామిలీ డార్క్ క్రైమ్ కామెడీ..
రేటింగ్: 2.75/5