Akhil Next Project: అఖిల్ కెరీర్ ఇన్నాళ్లూ ఒక లెక్క.. 'లెనిన్' సినిమా తర్వాత ఇంకో లెక్క. దాదాపు పదేళ్లుగా ఆయనెంతో వేచి చూసిన సక్సెస్ ఈ సినిమాతో దక్కింది. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడటంతో పాటు అఖిల్ కెరీర్ ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో 2.0 వర్షన్ మొదలవుతుంది. ఈ చిత్రం ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. ఓ రకంగా అఖిల్‌కు ఈ సినిమా కొత్త ఉత్సాహం ఇచ్చింది.
సక్సెస్‌ను తలకెక్కించుకోని అక్కినేని వారసుడు..
సక్సెస్ వచ్చినా కూడా అఖిల్ దాన్ని ఏమాత్రం తలకెక్కించుకోకుండా చాలా హుందాగా ఉండటం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. 'ఏజెంట్' టైమ్‌లో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించిన అయ్యగారు.. ఇప్పుడు చాలా మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తున్నారు. పైగా ఇకపై సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటానని అభిమానులకు ప్రామిస్ చేయడమే కాదు.. వచ్చే ఏడాదిలోపే మరో సినిమా చేస్తానని ఫ్యాన్స్ మాటిస్తున్నారు.
కథలు వినే పనిలో సిసింద్రీ..
ప్రస్తుతం కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు అఖిల్.. అందులో ఇద్దరు ముగ్గురు కొత్త దర్శకులు లైన్‌లో ఉన్నట్టు సమాచారం. నెక్ట్స్ ఏం చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. 'లెనిన్' తరహాలోనే నటనకు ఆస్కారమున్న పాత్ర చేస్తారా లేక కమర్షియల్ బాట పడతారా వెయిట్ అండ్ సీ. అయితే అభిమానులు మాత్రం ఏదైనా కమర్షియల్ దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తే అఖిల్‌కు తిరుగుండదని చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా అఖిల్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది ఎవరితో ఎపుడు ఉంటుందనేది చూడాలి మరి.