SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Archana Gautam Cafe Theft: బిగ్ బాస్ ఫెమ్ అర్చనా గౌతమ్ కేఫ్ లో భారీ చోరీ.. వీడియో రిలీజ్ చేసిన నటి.!.

Archana Gautam cafe robbed: కేఫ్‌లోకి చొరబడిన దొంగ ఏకంగా క్యాష్ కౌంటర్‌ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను నటి అర్చన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Written By Inamdar Paresh
Published: Oct 07, 2026, 10:46 AM IST | Updated: Oct 07, 2026, 10:54 AM IST
Image Credit: archanagautam(file)
Join

Bigg Boss 16 fame Archana Gautam Mumbai cafe robbed: బిగ్ బాస్ 16 ఫెమ్, మోడల్ అర్చనా గౌతమ్ కు చెందిన కేఫ్ లో దొంగలు పడ్డారు. ముంబైలో ఉన్న ఈ భామకు చెందిన కేఫ్ లో సోమవారం తెల్లవారుజామున ఒక ఆగంతకుడు ప్రవేశించాడు. నెమ్మదిగా కేఫ్ లోకి దూరి కౌంటర్ లో డబ్బులను చోరీ చేశాడు. ఈ ఘటన సెప్టెంబర్ 24 న చోటు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను అర్చన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

 

 

ముంబైలోని తన కేఫ్‌లో  ఒక ఆగంతకుడు ప్రవేశించాడని తెలిపారు. అదే విధంగా చాలా ఇష్టంతో, కష్టపడి నా  సేవింగ్స్ తో ఈ కేఫ్‌ను నిర్మించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న వస్తువును దగ్గరుండి మరీ సమకూర్చుకున్నట్లు తెలిపారు. కానీ ఒక దొంగ కేఫ్‌లోకి చొరబడి మొత్తం క్యాష్ కౌంటర్‌నే  ఎత్తుకెళ్లడం చాలా బాధగా ఉందన్నారు. 

అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడున్న కూడా తమ వ్యాపారాలపై నిరంతరం ఒక దృష్టి పెట్టాలని కూడా చెప్పుకొచ్చారు. ముంబైని చాలా మంది సెఫ్ ప్లేస్ అంటారని, అలాంటిచోట చోరీ జరగడం చాలా షాక్ కు గురిచేసిందన్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

 మరోవైపు అర్చనా గౌతమ్ 2025 అక్టోబర్‌లో ఈ కేఫ్‌ను ప్రారంభించి ఫుడ్ బిజినెస్‌లో ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఆమె "సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ ఇండియా" షోలో పాల్గొన్నారు. అదే విధంగా.. ‘బిగ్ బాస్ 16’  రియాలిటీ షోతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మరల ఖత్రోన్ కే ఖిలాడీ 13 వంటి రియాలిటీ షోలలో కూడా కనిపించింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES