సినిమాల్లో మొదలైన ఫ్రాంచైజీలు ట్రెండ్.. వరుసగా అదే బాటలో మేకర్స్..
Movie Franchise : ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లకే సీజన్ల మీద సీజన్లు రావడం చూశాము. కానీ, ఇప్పుడు సినిమాల్లోనూ అదే ట్రెండ్ మొదలైందా అంటే ఔననే చెప్పాలి. ఒక్కసారి కథ హిట్టైతే చాలు పార్ట్ 3, పార్ట్ 4 అంటూ మన స్టార్ డైరెక్టర్లు ఫ్రాంచైజీల మీద ఫ్రాంచైజీలు ప్లాన్ చేసుకుంటూ పోతున్నారు. ఒక్కసారి మొదలైతే ఆపేదే లేదంటున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో, ఏయే సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయో ఓ లుక్కేద్దాం.
Franchise New Trend In Indian Movies: కరోనా తర్వాత మన ప్రేక్షకులు ఓటీటీలకు అడిక్ట్ అయ్యారు. అంతేకాదు మంచి కథ, కథనాలతో తెరకెక్కిన సిరీస్‌లను నెత్తిన పెట్టుకొని మరీ చూస్తున్నారు. ఓటీటీలో వెబ్ సిరీస్‌లకు మాత్రమే కంటిన్యూగా సీజన్స్ వస్తుంటాయి. కానీ మన మూవీ డైరెక్టర్స్ సినిమాలను కూడా ఫ్రాంచైజీలుగా మార్చేస్తున్నారు. కేవలం రెండో భాగంతో సరిపెట్టకుండా ఏకంగా మూడు, నాలుగు పార్ట్స్‌కు సరిపడా కథలు రాసుకుంటూ వెళుతున్నారు. తాజాగా విడుదలైన జైలర్ 2 క్లైమాక్స్‌లో విజయ్ సేతుపతి ఎంట్రీతో జైలర్ 3 కూడా రాబోతోందని దర్శకుడు నెల్సన్ అదిరిపోయే హింట్ ఇచ్చారు.
దృశ్యం ఫ్రాంచైజీ..
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో నాలుగో భాగం ఉంటుందని ఇప్పటికే దర్శకుడు జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చేశారు. కానీ హిందీలో వేరే కథతో ఈ సినిమాను ముగించినా మలయాళంలో మాత్రం దృశ్యం 4 కంటిన్యూ అవుతుందని చెబుతున్నారు.
కాంతార ఫ్రాంచైజీ..
కాంతార ఫ్రాంచైజీలోనూ పార్ట్ 3 ఉంటుందని, ఇప్పటికే ఆ కథ రాసే పనిలో ఉన్నామని హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వయంగా వెల్లడించారు.
లైన్లో పుష్ప , కేజీఎఫ్..
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పుష్ప, కేజీయఫ్ చిత్రాలకు కూడా పార్ట్ 3 ఉంటుందని ఆయా దర్శకులు ఎప్పుడో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పుష్ప 3, కేజీయఫ్ 3 సెట్స్ మీదకు ఎప్పుడెళ్తాయో చూడాలి. ఖచ్చితంగా వస్తాయనే నమ్మకమైతే సినీ అభిమానుల్లో ఉంది. మొత్తానికి ఒక్కసారి కథ మొదలెడితే ఆపేదే లేదంటున్నారు డైరెక్టర్స్.