గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!
Garividi Lakshmi Public Talk: తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ నిర్మాతగా పరిచయమవుతూ నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది. ఆనంది టైటిల్ రోల్ల్ యాక్ట్ చేయగా రాగ్ మయూర్, సీనియర్ నరేష్, రాశి,తదితరులు కీలక పాత్రలు పోషించారు. గౌరీ నాయుడు జమ్ము ఈ చిత్రంతో దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందిందా లేదా చూద్దాం. కథ విషయానికి వస్తే.. గరివిడి గ్రామంలో జన్మించిన విజయలక్ష్మి (ఆనంది) జీవితం చిన్నతనం నుంచే ఎన్నో కష్టాల మధ్య సాగుతుంది. తండ్రి ప్రేమకు దూరమైన ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి జరుగుతుంది. అయితే భర్త చేసిన మోసంతో ఆమె జీవితం మరో మలుపు తిరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు పరిచయమైన బుర్రకథ కళ జీవితంపై కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. తనలోని ప్రతిభను గుర్తించి, బుర్రకథ కళాకారిణిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అసలు విజయలక్ష్మి గరివిడి లక్ష్మిగా ఎలా గుర్తింపు తెచ్చుకుంది? ఆమె జీవితంలో సత్యబాబు (రాగ్ మయూర్), రాంబాబు (నరేష్) పాత్రల ప్రాధాన్యం ఏమిటి? ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన యువ దర్శకుడు (అంకిత్ కొయ్య) ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? అనేదే ఈ సినిమా స్టోరీ. కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. విడుదలకు ముందే ‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆనంది ప్రదర్శించిన నృత్యం, ఆమె పాడిన పద్యాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శక, నిర్మాతలు ఇలా ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాను ప్రజల్లో తీసుకెళ్లారు. మొత్తంగా ఓ సాదాసీదా ఆడామె జీవిత ప్రయాణంలో ఈ మజిలీలో ఎన్నో ఎత్తు పల్లాలు, ఇంతకంటే ఓ సినిమాకు కావాల్సింది ఏముంటుంది. అచ్చు గరివిడి లక్ష్మి జీవితంలో బలమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. గతంలో వచ్చిన ‘మహానటి’ వంటి బయోపిక్స్ ప్రేక్షకుల మదిని దోచాయి. అంతేకాదు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి. అయితే గరివిడి లక్ష్మి ప్రత్యేకత వేరు. ఒక సామాన్య మహిళ జీవితంలోని సంఘర్షణలను, ఆమె ఎదుర్కొన్న అవమానాలను, కళ ద్వారా ఆమె సంపాదించుకున్న గుర్తింపును ఎంతో సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభంలో ఒక యువ దర్శకుడు గరివిడి లక్ష్మి జీవితాన్ని తెలుసుకునే క్రమంలో కథ ముందుకు సాగుతూ ఆమె జీవితానికి సంబంధించిన విషయాలను ఒక్కొక్కటిగా ముడివిప్పుతు సాగిపోతుంటుంది. ఆమె బాల్యం నుంచి వివాహం వరకు, ఆ తర్వాత ఎదురైన చేదు అనుభవాలు, బుర్రకథతో ఏర్పడిన అనుబంధం వంటి అంశాలను ఆసక్తికరంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం, లక్ష్మి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు కథకు బలమైన పునాది వేస్తాయి. సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి సినిమా మరింత భావోద్వేగభరితంగా మారుతుంది. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురైనా, వాటికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో కాకుండా తన కళనే నమ్ముకుని ముందుకు సాగే మహిళగా లక్ష్మి పాత్రను తీర్చిదిద్దిన విధానం సగటు ప్రేక్సఖులను ఆకట్టుకుంటుంది. కమర్షియల్ అంశాలు లేపోయినప్పటికీ కథలోని సహజత్వం ఆ లోటును భర్తీ చేస్తుంది. ముఖ్యంగా చివరి అరగంట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించే స్థాయిలో హృదయాన్ని తాకుతాయి. దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము తన తొలి సినిమాకే ఇలాంటి కథను ఎంచుకోవడం అభినందనీయం. పాత్రల మధ్య అనుబంధాలను, జీవితంలోని ఎత్తుపల్లాలను ఎలాంటి అనవసర హంగులు లేకుండా ఆవిష్కరించారు. సినిమా చూస్తున్నంతసేపు గరివిడి లక్ష్మి ఎవరో తెలియని వ్యక్తిలా కాకుండా మనకు తెలిసిన మనిషిలా అనిపించడం దర్శకుడి కథనానికి దక్కిన విజయం అని చెప్పాలి. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం ప్రత్యేక బలం. కథలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడంలో పాటలు, నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బుర్రకథ నేపథ్యాన్ని సంగీతంతో మేళవించిన విధానం సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఉత్తరాంధ్ర పల్లె అందాలను, అక్కడి జీవన విధానాన్ని సహజంగా చూపించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన వాతావరణం ప్రేక్షకులను కథ జరిగే కాలానికి తీసుకెళ్తుంది.విజయనగరం ప్రాంతీయ యాస కొన్ని చోట్ల ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు కొత్తగా అనిపించవచ్చు. అయితే ఆ యాసే కథకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. సంభాషణలు కూడా కథలోని భావాన్ని అర్థమయ్యేలా సాగుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. తొలి ప్రయత్నంలోనే కృతి ప్రసాద్ ఒక మంచి కథను ఎంచుకుని, దానిని నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం కమర్షియల్ లెక్కలకే పరిమితం కాకుండా, ఒక కళాకారిణి జీవితాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ప్రయత్నం అభినందించదగినది. నటీనటుల విషయానికొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఆనంది నటన. గరివిడి లక్ష్మి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతంగా ఉంది. పాత్రలోని అమాయకత్వం, బాధ, ఆత్మవిశ్వాసం, జీవితంలో ఎదగాలనే తపన.. ఇలా ప్రతి భావాన్ని ఎంతో సహజంగా పలికించింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆనంది నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆమె నటన చూస్తున్నంతసేపు తెరపై ఒక హీరోయిన్ కనిపించడం కంటే నిజమైన గరివిడి లక్ష్మి జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలగడం విశేషం. ఆనంది కెరీర్లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇది ఒకటని చెప్పాలి. రాగ్ మయూర్ మరోసారి తనకు లభించిన మంచి పాత్రను సమర్థంగా ఉపయోగించుకున్నారు. నరేష్ తన అనుభవాన్ని రంగరించి పాత్రకు మరింత బలాన్ని తీసుకొచ్చారు. రాశి పాత్రను కూడా చక్కగా తీర్చిదిద్దారు. ఆమె తన నటనతో ఆకట్టుకున్నారు. శరణ్య ప్రదీప్‌తో పాటు మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫైనల్ వెర్డిక్ట్: గరివిడి లక్ష్మి – మట్టి పరిమళంతో మనసులు గెలిచే ఎమోషనల్ బయోపిక్..! రేటింగ్: 2.75/5
Garividi Lakshmi Public Talk: తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ నిర్మాతగా పరిచయమవుతూ నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది. ఆనంది టైటిల్ రోల్ల్ యాక్ట్ చేయగా రాగ్ మయూర్, సీనియర్ నరేష్, రాశి,తదితరులు కీలక పాత్రలు పోషించారు. గౌరీ నాయుడు జమ్ము ఈ చిత్రంతో దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందిందా లేదా చూద్దాం.
కథ విషయానికి వస్తే..
గరివిడి గ్రామంలో జన్మించిన విజయలక్ష్మి (ఆనంది) జీవితం చిన్నతనం నుంచే ఎన్నో కష్టాల మధ్య సాగుతుంది. తండ్రి ప్రేమకు దూరమైన ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి జరుగుతుంది. అయితే భర్త చేసిన మోసంతో ఆమె జీవితం మరో మలుపు తిరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు పరిచయమైన బుర్రకథ కళ జీవితంపై కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. తనలోని ప్రతిభను గుర్తించి, బుర్రకథ కళాకారిణిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
అసలు విజయలక్ష్మి గరివిడి లక్ష్మిగా ఎలా గుర్తింపు తెచ్చుకుంది? ఆమె జీవితంలో సత్యబాబు (రాగ్ మయూర్), రాంబాబు (నరేష్) పాత్రల ప్రాధాన్యం ఏమిటి? ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన యువ దర్శకుడు (అంకిత్ కొయ్య) ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
విడుదలకు ముందే ‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆనంది ప్రదర్శించిన నృత్యం, ఆమె పాడిన పద్యాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శక, నిర్మాతలు ఇలా ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాను ప్రజల్లో తీసుకెళ్లారు. మొత్తంగా ఓ సాదాసీదా ఆడామె జీవిత ప్రయాణంలో ఈ మజిలీలో ఎన్నో ఎత్తు పల్లాలు, ఇంతకంటే ఓ సినిమాకు కావాల్సింది ఏముంటుంది. అచ్చు గరివిడి లక్ష్మి జీవితంలో బలమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
గతంలో వచ్చిన ‘మహానటి’ వంటి బయోపిక్స్ ప్రేక్షకుల మదిని దోచాయి. అంతేకాదు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి. అయితే గరివిడి లక్ష్మి ప్రత్యేకత వేరు. ఒక సామాన్య మహిళ జీవితంలోని సంఘర్షణలను, ఆమె ఎదుర్కొన్న అవమానాలను, కళ ద్వారా ఆమె సంపాదించుకున్న గుర్తింపును ఎంతో సహజంగా చూపించే ప్రయత్నం చేశారు.
సినిమా ప్రారంభంలో ఒక యువ దర్శకుడు గరివిడి లక్ష్మి జీవితాన్ని తెలుసుకునే క్రమంలో కథ ముందుకు సాగుతూ ఆమె జీవితానికి సంబంధించిన విషయాలను ఒక్కొక్కటిగా ముడివిప్పుతు సాగిపోతుంటుంది. ఆమె బాల్యం నుంచి వివాహం వరకు, ఆ తర్వాత ఎదురైన చేదు అనుభవాలు, బుర్రకథతో ఏర్పడిన అనుబంధం వంటి అంశాలను ఆసక్తికరంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం, లక్ష్మి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు కథకు బలమైన పునాది వేస్తాయి.
సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి సినిమా మరింత భావోద్వేగభరితంగా మారుతుంది. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురైనా, వాటికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో కాకుండా తన కళనే నమ్ముకుని ముందుకు సాగే మహిళగా లక్ష్మి పాత్రను తీర్చిదిద్దిన విధానం సగటు ప్రేక్సఖులను ఆకట్టుకుంటుంది. కమర్షియల్ అంశాలు లేపోయినప్పటికీ కథలోని సహజత్వం ఆ లోటును భర్తీ చేస్తుంది. ముఖ్యంగా చివరి అరగంట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించే స్థాయిలో హృదయాన్ని తాకుతాయి.
దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము తన తొలి సినిమాకే ఇలాంటి కథను ఎంచుకోవడం అభినందనీయం. పాత్రల మధ్య అనుబంధాలను, జీవితంలోని ఎత్తుపల్లాలను ఎలాంటి అనవసర హంగులు లేకుండా ఆవిష్కరించారు. సినిమా చూస్తున్నంతసేపు గరివిడి లక్ష్మి ఎవరో తెలియని వ్యక్తిలా కాకుండా మనకు తెలిసిన మనిషిలా అనిపించడం దర్శకుడి కథనానికి దక్కిన విజయం అని చెప్పాలి.
ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం ప్రత్యేక బలం. కథలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడంలో పాటలు, నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బుర్రకథ నేపథ్యాన్ని సంగీతంతో మేళవించిన విధానం సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.
సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఉత్తరాంధ్ర పల్లె అందాలను, అక్కడి జీవన విధానాన్ని సహజంగా చూపించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన వాతావరణం ప్రేక్షకులను కథ జరిగే కాలానికి తీసుకెళ్తుంది.విజయనగరం ప్రాంతీయ యాస కొన్ని చోట్ల ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు కొత్తగా అనిపించవచ్చు. అయితే ఆ యాసే కథకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. సంభాషణలు కూడా కథలోని భావాన్ని అర్థమయ్యేలా సాగుతాయి.
నిర్మాణ విలువలు బాగున్నాయి. తొలి ప్రయత్నంలోనే కృతి ప్రసాద్ ఒక మంచి కథను ఎంచుకుని, దానిని నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం కమర్షియల్ లెక్కలకే పరిమితం కాకుండా, ఒక కళాకారిణి జీవితాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ప్రయత్నం అభినందించదగినది.
నటీనటుల విషయానికొస్తే..
ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఆనంది నటన. గరివిడి లక్ష్మి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతంగా ఉంది. పాత్రలోని అమాయకత్వం, బాధ, ఆత్మవిశ్వాసం, జీవితంలో ఎదగాలనే తపన.. ఇలా ప్రతి భావాన్ని ఎంతో సహజంగా పలికించింది.ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆనంది నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆమె నటన చూస్తున్నంతసేపు తెరపై ఒక హీరోయిన్ కనిపించడం కంటే నిజమైన గరివిడి లక్ష్మి జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలగడం విశేషం. ఆనంది కెరీర్లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇది ఒకటని చెప్పాలి.
రాగ్ మయూర్ మరోసారి తనకు లభించిన మంచి పాత్రను సమర్థంగా ఉపయోగించుకున్నారు. నరేష్ తన అనుభవాన్ని రంగరించి పాత్రకు మరింత బలాన్ని తీసుకొచ్చారు. రాశి పాత్రను కూడా చక్కగా తీర్చిదిద్దారు. ఆమె తన నటనతో ఆకట్టుకున్నారు. శరణ్య ప్రదీప్‌తో పాటు మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
పంచ్ లైన్: గరివిడి లక్ష్మి – మట్టి పరిమళంతో మనసులు గెలిచే ఎమోషనల్ బయోపిక్..!
రేటింగ్: 3/5