Mokshu Debut Movie:మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ విడుదలకు ముందే మరో ప్రాజెక్ట్‌తో బిజీ అవుతున్నారు డైరెక్టర్ వశిష్ట. మోక్షజ్ఞ డెబ్యూని ప్రెస్టీజియస్‌గా తీసుకుని సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో జాలీగా కనిపించే హీరో క్యారెక్టర్.. తర్వాత కథ ముందుకు వెళ్లేకొద్దీ అసలైన బలాన్ని చూపించేలా డిఫరెంట్ షేడ్స్‌లో స్టోరీని రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘బింబిసార’ తరహాలోనే ఇందులోనూ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్లు తెలుస్తుంది.
బాలయ్య కెమియో..
మోక్షజ్ఞ సినిమాకు అసలైన హైలైట్ బాలకృష్ణ స్పెషల్ క్యామియో అంటున్నారు.. సెకండాఫ్‌లో క్రూషియల్ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చే బాలయ్య క్యారెక్టర్ స్టోరీని మలుపు తిప్పడమే కాకుండా.. మెయిన్ పిల్లర్‌గా నిలవబోతోందన్నట్టు తెలుస్తుంది. అన్నీ కుదిరితే ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులను చూసుకునే అవకాశం ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కు కూడా పెద్ద ట్రీటే అని చెప్పాలి.
డిసెంబర్‌లో ముహూర్తం..
డిసెంబర్ మొదటి వారంలో ముహూర్తం పెట్టి.. వీలైనంత త్వరగా షూట్ స్టార్ట్ చేసేలా కనిపిస్తున్నారు మేకర్స్. భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో షూటింగ్ జరుగుతున్నప్పుడే పారలల్‌గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసేలా పక్కా స్కెచ్ వేస్తున్నారు వశిష్ట. ఇప్పటికే మోక్షు లుక్ టెస్ట్ కూడా పూర్తైపోయింది. దాదా షూటింగ్ పూర్తి కాగానే మోక్షు సినిమాపై ఫోకస్ చేయనున్నారు బాలయ్య. ఇక బాలకృష్ణ కూడా ‘దాదా’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి కుమారుడి సినిమాపైనే నజర్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.