• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /ప్రముఖ ఓటీటీలో ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ ట్రెండింగ్.. ఫస్ట్ వీక్‌లోనే అద్భుతమైన రెస్పాన్స్..

ప్రముఖ ఓటీటీలో ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ ట్రెండింగ్.. ఫస్ట్ వీక్‌లోనే అద్భుతమైన రెస్పాన్స్..

OTT Trending movie in Its A Miracle: థియేట్రికల్‌గా మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమాలను ఓటీటీలో స్ట్రీమింగ కాగానే ఎక్కువ మంది వాచ్ చేయడం గత కొన్ని రోజులుగా జరగుతున్న ముచ్చటే కదా. ఇక మలయాళంలో థియేట్రికల్‌గా సూపర్ హిట్టైన ‘ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్’ మూవీ గత వారమే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు విడుదలైన వారంలోపే సంచలన వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 05, 2026, 06:22 AM IST|Updated: Nov 05, 2026, 03:27 PM IST
joinshare
ప్రముఖ ఓటీటీలో ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’  ట్రెండింగ్.. ఫస్ట్ వీక్‌లోనే అద్భుతమైన రెస్పాన్స్..
Image Credit: Its Medical Miracle (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

2

ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!

3

సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్‌.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..

4

ZPTC And MPTC Elections: గొడవలేం లేవు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రశాంతం: ఎన్నికల సంఘం

5

King Cobra Video: కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Manorama Max: థియేటర్స్‌లో సూపర్ హిట్టైన  షరాఫుద్దీన్, సంగీత్ ప్రతాప్ నటించిన  ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ చిత్రం మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌తో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.  ఈ కామెడీ థ్రిల్లర్ ఓటిటి స్ట్రీమింగ్ విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్ల నిమిషాలకు పైగా వాచ్ టైమ్‌ను నమోదు చేసి సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సహా నాలుగు భాషల్లో  మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుతుంది.  కొత్త దర్శకుడు శ్యామిన్ గిరీష్ డైరెక్ట్ చేసిన వహించిన ఈ చిత్రం ఇప్పటి వరకు రాని ఒక వినూత్నమైన కథాంశాన్ని హాస్యాన్ని జోడించడంతో పాటు అద్భుతమైన  ఊహించని ట్విస్టులతో  ఆద్యంతం ఆసక్తి రేకిత్తించేలా ఉంది.  

‘ప్రేమలు’ చిత్రంలో అమల్ డేవిస్‌గా, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’లో జోయెల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ ప్రతాప్ ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ హీరోగా లీడ్ రోల్‌లో యాక్ట్ చేశారు. షరాఫుద్దీన్ ఒక కీలక పాత్రలో మెరిశారు. కోమాలో నుంచి అద్భుతంగా కోలుకుని, దూరం నుంచి వచ్చే శబ్దాలు, సంభాషణలను వినే అసాధారణ శక్తిని పొందిన రూబిన్ (సంగీత్ ప్రతాప్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సూరజ్ (షరాఫుద్దీన్) అనే స్నేహపూర్వక పోలీసు అధికారిని కలవడం వల్ల జరిగే ఊహించని పరిణామాలు ఈ చిత్రంలో కామెడీ, సస్పెన్స్‌ను జోడించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో షరాఫుద్దీన్, సంగీత్ ప్రతాప్‌లతో పాటు అఖిల భార్గవన్, పార్వతి ఆర్. కృష్ణ, కోట్టాయం నసీర్, ఆనంద్ మన్మధన్, కిరణ్ పీతాంబరన్ తదితరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. ప్రత్యేకమైన కథాంశం, హాస్య భరితమైన క్షణాలు, ఒక అసాధారణ శక్తి చుట్టూ తిరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త  అనుభూతిని ఇవ్వడం పక్కా అని చెప్పొచ్చు.

‘కరిక్కు’ ఫేమ్ నీలీన్ సంద్ర ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. డా. పాల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, డ్రీమ్ బిగ్ ఫిలిప్స్ బ్యానర్ పై  డాక్టర్ పాల్ వర్గీస్, సుజిత్ జే నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ జేవియర్ సినిమాటోగ్రఫీ అందించారు. రాకేష్ చెరుమడం ఎడిటర్‌గా వ్యవహరించారు. ముజీబ్ మజీద్ సంగీతం అందించారు. నిక్సన్ జార్జ్ సౌండ్ డిజైనర్‌గా పనిచేశారు.మనోరమా మాక్స్ ఓటీటీ విషయానికొస్తే.. ఈ ఓటీటీలో  500కి పైగా బ్లాక్‌బస్టర్ సినిమాలు, 20,000 గంటలకు పైగా కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.    
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie