• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Jailer 2 Review: ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ అయిందా..!

Jailer 2 Review: ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ అయిందా..!

Jailer 2 Review: సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు 70 దాటినా.. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తన ఏజ్‌కు తగ్గ పాత్రలతో మెప్పిస్తున్నారు. తాజాగా ఈయన ‘జైలర్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘జైలర్ 2’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాతో తలైవా మ్యాజిక్ మరోసారి పనిచేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 15, 2026, 12:29 PM IST|Updated: Oct 15, 2026, 01:43 PM IST
joinshare
Jailer 2 Review: ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ అయిందా..!
Image Credit: Jailer 2 Review Rating Public Talk (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Pakistan: పాకిస్తాన్ లో కుప్పకూలీన స్కూల్ పైకప్పు.. 30 మంది విద్యార్థుల దుర్మరణం, 40 మందికిపై తీవ్ర గాయాలు..

Pakistan: పాకిస్తాన్ లో కుప్పకూలీన స్కూల్ పైకప్పు.. 30 మంది విద్యార్థుల దుర్మరణం, 40 మందికిపై తీవ్ర గాయాలు..

2

Pakistan School Roof Collapse: ఘోర ప్రమాదం.. స్కూల్ పైకప్పు కూలి 20 మంది చిన్నారులు మృతి!

3

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం..మీ ఓటు ఉందా? లేదా? ఎలా చెక్ చేయాలంటే?

4

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్! అక్టోబర్ 27 నుంచి కౌంటర్ టికెట్ల నిబంధనల్లో మార్పులు.. ఇవి తెలుసుకోకపోతే కష్టమే!

5

Puneeth Rajkumar Death: పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ముందు చివరి గంటన్నరలో ఏం జరిగింది?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

మూవీ రివ్యూ: జైలర్ 2 (Jailer 2)
నటీనటులు: రజినీకాంత్, మిథున్ చక్రబర్తి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, ఎస్.జే.సూర్య,సూరజ్ వెంజరమూడు, విద్యాబాలన్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు
సంగీతం: అనిరుథ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్ 
ఎడిటర్: ఆర్ నిర్మల్ 
బ్యానర్: సన్ పిక్చర్స్
నిర్మాత: కళానిధి మారన్ 
రచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్   
విడుదల తేది: 15-10-2026

కథ విషయానికొస్తే..

టైగర్ ముత్తువేల పాండ్యన్ (రజినీకాంత్) కుమారుడు చనిపోయిన తర్వాత ఓ సూపర్ మార్కెట్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో  విగ్రహాల స్మగ్లింగ్ చేసే వర్మను చంపిన టైగర్‌ను వెతకాడానికి వర్మకు ఫ్రెండ్ దిలీప్ (సూరజ్ వెంజరమూడు) తన మనుషులతో వెతికిస్తుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది..? మరోసారి చిక్కుల్లో పడ్డ తన కుటుంబాన్ని టైగర్ తన కుటుంబాన్ని ఎలా కాపాడాడు..? ప్రత్యర్ధులను ఎలా అంతం మొందించాడనేదే ఈ సినిమా కథ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. ‘జైలర్’ సినిమా ఎక్కడ ముగుస్తుందో అక్కడే మొదలు పెట్టాడు. ముఖ్యంగా గత చిత్రాల మాదిరే ఈ చిత్రాన్ని క్రైమ్, యాక్షన్ కామెడీగానే తెరకెక్కించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లోనే కామెడీని మిక్స్ చేసిన విధానం ఈ సారి కూడా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా స్క్రీన్ ప్లే .  ముఖ్యంగా విగ్రహాల స్మగ్లర్ వర్మ (వినాయక్)ను చంపిన తర్వాత టైగర్ ముత్తువేల్ ప్యాండ్యన్‌ను వెతకడానికి విలన్ తన మనుషులను పెడతాడు. ఈ క్రమంలో విలన్ మనుషులు హీరోను వెతుకుతూ ఉంటారు. మరోవైపు విలన్స్‌కు దగ్గర కావడానికి హీరో వేసే ఎత్తులతో విలన్‌ దగ్గర కావడం.. ఇంటర్వెల్  బ్యాంగ్‌‌లో విలన్ మనుషులను హీరో మనుషులతో లేపెట్టేయడం వంటి సీన్స్ మాస్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రజినీకాంత్ ఇమేజ్, ఏజ్‌ దృష్టిలో పెట్టుకొని సీన్స్ రాసుకున్నాడు. అవి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. ముఖ్యంగా హీరోతో ఒక గన్‌తో ఇద్దరు విలన్స్‌ను చంపడం.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌ల క్యామియోలతో విలన్స్‌ను తుక్కురేగ్గొట్టడం వంటి సీన్స్2తో  ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు.

ముఖ్యంగా శివరాజ్ కుమార్ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసిన విలన్ గ్యాంగ్‌ నుంచి వాళ్ల నాన్నను కిడ్నాప్ చేసే సీన్.  విలన్స్ ఎత్తుకు హీరో పై ఎత్తులు వేయడం వంటి సీన్స్ బాగున్నాయి.  మరోవైపు తన కుమారుడిని తనే చంపాడనే విషయం భార్య, కోడలు, మనవడికి తెలిసిన తర్వాత  వాళ్లు రియాక్ట్ అయ్యే సీన్స్ నాటకీయతతో పాటు ఎమోషన్‌కు గురి చేస్తాయి. ముఖ్యంగా విద్యాబాలన్, రజినీకాంత్ మధ్య సీన్స్ హైలెట్‌ అని చెప్పాలి. ఇక మైసూర్ బొండాలో మైసూర్ లేనట్టే.. జైలర్ మూవీలో జైలర్ పాత్ర తాలూకు వేషం లేకపోవడం.. ఒక అర నిమిషం పాటు రజినీకాంత్ జైలర్‌గా ఓ మంత్రి ఊహించుకునే సీన్‌లో మాత్రమే రజినీ కాంత్ ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తాడు.

టెక్నిషియన్స్ విషయానికొస్తే..

 దర్శకుడు నెల్సన్ జైలర్ కథకు కొనసాగింపుగా ఈ  కథను రాసుకోవడం.. అందులో ట్విస్టులు.. యాక్షన్ ఎపిసోడ్స్.. హీరో, విలన్ మధ్య ఎత్తుకు పై ఎత్తులు వంటి సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌ కొంచెం ల్యాగ్ చేసినట్టు కనిపిస్తుంది.  కొన్ని చోట్ల లాజిక్‌కు అందని సీన్స్ ఉన్నాయి. ఇక జైలర్ లో తమన్నా ఐటెం పాట ప్లస్ అయితే.. జైలర్ 2లో నోరా ఫతేహితో ఐటెం పాట కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఈ సినిమాలో అన్నిటి కంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే అనిరుథ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. మరోసారి తన ఆర్ఆర్‌తో ఈ సినిమాను నిలబెట్టాడు. జైలర్ మాదిరే జైలర్ 2కు అనిరుథ్ ఆర్ఆర్ బిగ్ ఎస్సెట్‌గా నిలిచింది. ఎడిటిర్ సెకండాఫ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ, సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

రజినీకాంత్ మరోసారి తన స్వాగ్‌తో మెప్పించాడు. టైగర్ ముత్తవేల్ పాండ్యన్‌గా ఇరగదీసాడు. యాక్షన్, ఎమోషన్ సహా అన్ని సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. మిథున్ చక్రబర్తి చక్రి కల్పక్‌గా చక్రాల కుర్చీకే పరిమితైన డాన్ పాత్రలో ఇరగదీసాడు. ఎస్.జే. సూర్య భోధి కల్పక్‌ పాత్రలో జీవించాడు. అతని విలనిజంతో రజినీ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. ఇక విద్యాబాలన్ కాంత కల్పక్ పాత్రలో బోధి కల్పక్ సిస్టర్ పాత్రలో విలన్‌గా ఇరగదీసింది. రజినీకాంత్ తో ఈమె సీన్స్ బాగా పండాయి. ఓ రకంగా లేడీ డాన్ పాత్రలో ఒదిగిపోయింది. సూరజ్ వెంజరమూడు బోధి కల్పక్ అసిస్టెంట్‌గా ఇంటర్వెల్ వరకు విలన్‌గా సినిమాను తన భుజాలపై మోసాడు. రమ్యకృష్ణ సగటు ఇల్లాలి పాత్రలో తన మార్క్ నటనతో ఒదిగిపోయింది. కొడుకు తన భర్తే చంపాడనే తెలిసే సీన్‌లో ఆమె నటన అద్భుతం. కోడలి పాత్రలో నటించిన నటి..మంచి నటనే రాబట్టింది. క్లైమాక్స్‌లో  హృతిక్ రోషన్  కెమియోతో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌, జాకీ ఫ్రాఫ్‌ల అతిథి పాత్రల్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేశారు. ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలైన రజినీ, మిథున్, మోహన్‌లాల్‌ ముగ్గురు  ఒకే సినిమాలో నటించడం విశేషమనే  చెప్పాలి.విజయ్ సేతుపతి క్లైమాక్స్‌లో కనిపించి సర్రైజ్ చేశాడు. ఇక మూర్తి పాత్రలో నటించిన నమో నారాయణ, విమల్‌గా యోగిబాబులు తమ కామెడీతో నవ్వించారు.

ప్లస్ పాయింట్స్

రజినీకాంత్ స్వాగ్

హృతిక్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌ల క్యామియోలు

అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ స్లో నేరేషన్

లాజిక్‌కు అందని సీన్స్

పంచ్ లైన్..  ‘జైలర్ 2’.. వన్ అండ్ ఓన్లీ రజినీకాంత్..

Add Zee News as a Preferred Source
TAGS:
Movie Review
Tollywood
Telugu Movie