‘సిగ్మా’ మూవీ రివ్యూ.. విజయ్ కుమారుడి సినిమా ఎలా ఉందంటే..!!
Sigma Movie Review: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తొలిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమాతో సందీప్ కిషన్‌కు హిట్ ఇచ్చిన దర్శకుడిగా జేసన్ సంజయ్ మురిపించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
విజయ్ తనయుడు కావడంతో సంజయ్ సినిమాపై తెలుగులోనూ మంచి ఆసక్తే ఉంది. స్టార్ హీరో తనయుడిగా కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వకుండా.. తాత బాటలో మెగాఫోన్ పట్టుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే సందీప్ కిషన్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి వాటిని ఈ సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం.
కథ విషయానికొస్తే..
గురు (సందీప్ కిషన్) తనకు తల్లి నుంచి సంక్రమించిన లైబ్రరీని రన్ చేస్తుంటాడు. అందులో ఉన్న పుస్తకాల్లో కథలను ఆడియో రూపంలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. ఇతనికి తండ్రి నుంచి ఆస్తి కాకుండా రూ. కోటి రూపాయలు అప్పు వారసత్త్వంగా వస్తుంది. అది వడ్డీతో కలిపి కోటి 25లక్షలు అవుతుంది. అది తీర్చమని అప్పు ఇచ్చిన వాళ్లు గురును పీడిస్తూ ఉంటారు. మరోవైపు తెలంగాణకు చెందిన వీరప్పరెడ్డితో దయా అనే వ్యక్తి తాను మరో వ్యక్తితో చేస్తోన్న గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన రహస్యాలను చెబుతాడు. దీంతో అతన్ని పార్టనర్‌గా చేసుకుంటాడు వీరప్ప రెడ్డి. అంతేకాదు తను దాచి పెట్టిన డబ్బులకు సంబంధించిన రెండు తాళం చెవులల్లో ఒక దాన్ని అతనికి ఇస్తాడు. ఈ క్రమంలో వీరప్ప రెడ్డి తాళం చెవి ఇచ్చి దయా హత్యకు గురవుతాడు. ఈ క్రమంలో దయాను చంపింది ఎవరు..? ఇక హత్య చేయబడ్డ దయా దగ్గరున్న తాళం చెవి గురు దగ్గరకు వస్తుంది. అది అతనికి ఆ ‘కీ’ఎలా చేరింది. ? ఈ క్రమంలో రెడ్డి గ్యాంగ్ ఆ కీ కోసం గురును వెంబడిస్తారు. ఈ క్రమంలో ఏం జరిగింది. చివరకు రెడ్డి దాచిపెట్టిన డబ్బులు హీరోకు దక్కాయా లేదా చివరకు ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
జేసన్ జాన్సన్.. తండ్రి బాటలో నటనను కాదని.. తాత బాటలో తొలిసారి మెగాఫోన్ పట్టుకొని ‘సిగ్మా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘సిగ్మా’ టైటిల్ విషయానికొస్తే..‘ఎదురులేని మనిషి.. దేన్నీ లెక్కచేయడని అర్ధం’. హీరో పాత్రను కూడా దేనికి లెక్క చేయనివాడనే అర్ధంలో ఈ సినిమా కథను రాసుకున్నాడు జేసన్ జాన్సన్. ముఖ్యంగా ఈ సినిమాకు డ్రగ్స్, గ్లాంబ్లింగ్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ వరకు కథ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో ఏం చేయాలో తెలియక.. తడబడ్డాడు. ఎక్కడా ఆరంభించాలో కాదు.. ఎక్కడ ముగించాలో కూడా తెలిసుండాలి. ఈ సినిమా కథ బాగానే ఉన్నా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశాడు సంజయ్. ఇందులో హీరో కథలను ఆడియో రూపంలో మారుస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. అతనికి కథానాయిక ఆర్జే సామ్ ఓ పబ్‌లో పరిచయం అవుతుంది. ఆమె గొంతును ఏఐ టెక్నాలజీ సాయంతో ఆడవాళ్లు చెబుతున్నట్టుగా కథలను అప్‌లోడ్ చేస్తుంటాడు. దానికి మంచి వ్యూవర్ షిప్ వస్తుంది. దీంతో హీరోయిన్ కు విషయం తెలియడంతో ఆమెను పార్ట్‌నర్‌గా చేర్చుకుంటాడు. తన ఇంటిని కాపాడుకునే క్రమంలో అతను గ్యాంబ్లింగ్ కారణంగా తన దగ్గరున్న డబ్బులు పోగోట్టుకుంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఫాదర్ ఓ యాక్సిడెంట్ ఆసుపత్రి పాలు కావడం వంటి సీన్స్ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసున్నట్టు కనబడింది.
ఇక గ్యాంబ్లింగ్ సంబంధించిన దయా.. ఓ రకమైన మత్తు పదార్ధులను తనకు సంబంధించిన గ్లాంబ్లింగ్ పార్టనర్‌కు చెందిన కేసీనోకు సప్లై చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆ మత్తు పదార్ధాలు తీసుకున్న వారు ఎక్కువ డోస్ కారణంగా తూలి పడిపోతుంటారు. ఈ క్రమంలో అతను తెలంగాణకు చెందిన వీరప్ప రెడ్డితో తన గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన సీక్రెట్స్ అన్ని చూపెట్టి అతన్ని మచ్చిక చేసుకోవడం.. అతను తన పార్టనర్‌గా తీసుకోవడంతో పాటు తన వెయ్యి కోట్లకు సంబంధించిన ఓ పెద్ద లాకర్‌కు సంబంధించిన ’రెండు కీస్‌లలో ఒకదాన్ని అతనికి ఇవ్వడం.. ఆ తర్వాత దయా తన గ్లాంబ్లింగ్ పార్ట్‌నర్ తో ఓ చిన్న గొడవ వల్ల చనిపోతాడు.
ఆ తర్వాత అతన్ని గ్యాంబ్లింగ్ పార్టనర్ దగ్గర పనిచేసే వ్యక్తి అతన్ని పాతి పెట్టడం.. ఆ తర్వాత హీరో ఓ అతను చనిపోయడానుకొని ఓ గొయ్యి తీయడం.. అందులో హీరో దగ్గరుండే కుక్క పెన్ డ్రైవ్‌తో పాటు కీను తీసుకురావడం.. ఒక దాని తర్వాత వచ్చే సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఓ రకంగా ప్రేక్షకుల సహనానికీ పెద్ద పరీక్ష పెట్టాడు. చివర్లో రెడ్డికి సంబంధించిన లాకర్ వేరే దేశంలో ఉన్నట్టు చూపెట్డడం.. అది ఏ దేశమే తెలియకపోవడం.. ఇంత పెద్ద దేశంలో అతనికి లాకర్ పెట్టుకోకుండా ఎక్కడో పెట్టుకోవడం ఏమిటి..? ఇక లాకర్ అనేది ఏదైనా స్విస్ బ్యాంకు అకౌంట్లోనే .. మరే బ్యాంక్ లాకర్ కు సంబంధించిన కీ లాంటివి పెడితే లాజిక్‌కు అందేది. స్లో నేరేషన్.. సెకండాఫ్ సాగదీత ఈ చిత్రానికి మైనస్ పాయింట్స్. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. తొలి చిత్రమే అయినా.. కొన్ని మేకింగ్ సీన్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేము.
నటీనటుల విషయానికొస్తే..
సందీప్ కిషన్ తనదైన నటనతో మెప్పించాడు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. కొన్నిసీన్స్‌లో మంచి ఈజ్ చూపించాడు. ఫరియా అబ్ధుల్లా తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. సంపత్ మరోసారి తన మార్క్ విలనిజంతో మెప్పించాడు. విలన్స్‌గా నటించిన మరో ముగ్గురు నటులు తమ పరిధి మేరకు రాణించారు. రాజు సుందరం ఉన్నంతలో ఓకే అనిపించాడు.
పంచ్ లైన్.. సిగ్మా.. ఓ మోస్తరుగా మెప్పించే థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా..
రేటింగ్: 2.75/5