• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టే ‘జయంత్ అండ్ ద జింగో పెన్’ మూవీ..

పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టే ‘జయంత్ అండ్ ద జింగో పెన్’ మూవీ..

Jayannth & The Jingo Pen Telugu Movie Review:మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో  మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘జయంత్ అండ్ ద జింగో పెన్’.  నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు.  జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన డైరెక్ట్ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా  ఎలా మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 01:17 PM IST|Updated: Nov 14, 2026, 08:20 PM IST
joinshare
పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టే ‘జయంత్ అండ్ ద జింగో పెన్’ మూవీ..
Image Credit: Jayanth And Jingo Pen Movie Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Srikalahasti: ఏపీలో అమానవీయం.. అప్పు చెల్లించలేదని 6 నెలల పసికందు కిడ్నాప్.. అసలు స్టోరీ ఇదే..

Srikalahasti: ఏపీలో అమానవీయం.. అప్పు చెల్లించలేదని 6 నెలల పసికందు కిడ్నాప్.. అసలు స్టోరీ ఇదే..

2

Mohit Ulva: హైఓల్టేజ్ పోరులో చివరి బంతికి బౌండరీ.. పాక్‌పై భారత్‌ను గెలిపించిన మోహిత్ ఉల్వా ఎవరు..?

3

CM Revanth reddy: ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలి.. భారత్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

4

IND Vs PAK Under 19 Asia Cup: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమ్ఇండియా..అండర్-19 ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్!

5

Madurai Tanishq Theft: మధురై తనిష్క్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..ఫెమస్ యూట్యూబర్ అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jayannth & The Jingo Pen Telugu Movie Review:మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో  మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘జయంత్ అండ్ ద జింగో పెన్’.  నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు.  జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన డైరెక్ట్ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా  ఎలా మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.


కథ విషయానికొస్తే.. 
జయంత్ (జయంత్ బొలిశెట్టి)కి లెక్కలంటే  దడ.  ఆ సబ్జెక్ట్ అంటే ముచ్చెమటలు పడుతుంటాయి. దానికి తోడు లెక్కల మాస్టారు హర్ష (సత్యం రాజేష్) విద్యార్ధులు మంచి మార్కులు తెచ్చుకోవాలని ఉద్దేశ్యంతో బెత్తానికి పనిచెప్పే టైపు. అంతేకాదు కేవలం లెక్కల్లో కాదు చదవులో స్లో. ముఖ్యంగా స్కూల్‌కు లేట్‌గా రావడం.. మాస్టర్స్‌తో పనిష్మెంట్ ద్వారా ఇతర విద్యార్ధుల్లో చులకన అవుతారు అతడితో పాటు అతని ఫ్రెండ్స్. అంతేకాదు నిత్యం ఏదో ఒక పోట్లాట వల్ల వాళ్ల తల్లిదండ్రులు (మానస రాధాకృష్ణన్, ఆశిష్ గాంధీ) మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జయంత్‌కి దొరికిన ఆ ‘జింగో పెన్’ అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది ? అసలు ఆ పెన్ వెనుక ఉన్న కథేంటి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

గతంలో తెలుగులో పిల్లల నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చేవి. ఈ మధ్యకాలంలో అపుడపుడు చిన్నారుల నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలనే నమోదు చేస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన చిత్రమే ‘జయంత్ అండ్ జింగో పెన్’ మూవీ . ముఖ్యంగా పిల్లలు తమ తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పుకోలేని మానసిన సంఘర్షణ, వారి ఇష్టాయిష్టాలు.. తదితర విషయాలను తెరపై ప్రెజెంట్ చేయడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ముఖ్యంగా పేరేంట్స్ ప్రవర్తన పిల్లల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని చక్కటి సందేశాత్మకంగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సినిమాలో మాటలు, పాటలు  మెయిన్ పిల్లర్‌గా నిలిచాయి. పిల్లలు, తల్లితండ్రులు, గురువుల తప్పుకుండా చూడాల్సిన సినిమా.

ఫస్ట్ హాఫ్ అంతా పిల్లల గోల, అంతా సరదగా సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పేరేంట్స్‌తో మాట్లాడే తీరు.. దేవుడికి గురించి తెలుసుకునే సీన్స్ మనసులకు హత్తుకుంటుంది. బేబీ ఊహ, జయంత్ మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి.  లెక్కల మాస్టారుని పోలీస్ స్టేషన్ వద్ద జయంత్ పట్టించడం వంటి సీన్స్ సరదగా సాగిపతాయి.

సెకండాఫ్‌లో  జయంత్ చేతికి జింగో పెన్ రావడం, దాని సహాయంతో లెక్కలను సులువుగా సాల్వ్ చేయడం, క్లాస్‌రూమ్‌లో జయంత్ హీరోగా మారడం వంటి సీన్స్‌ అలరిస్తాయి. ఆ తర్వాత పెన్ చెప్పినట్లుగా జయంత్ బుద్ధిగా నడుచుకోవడం, స్కూల్లో అతను చెప్పే టిప్స్ అందరికీ బాగా ఉపయోగపడతాయి. మధ్యలో తాత, మనవళ్ల మధ్య భావోద్వేగబరితమైన సీన్స్, స్కూల్ టీజర్స్‌తో అనుబంధం, మిగతా పిల్లలతో ఫ్రెండ్ షిప్ వంటి సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు ప్రాణం. జయంత్‌లో వచ్చే మార్పు అందరినీ ఆకట్టుకుంటాయి. పిల్లలను ఎలా అర్థం చేసుకోవాలో, వారితో ఎలా మెలగాలో చక్కటి సందేశాన్ని ఇస్తూ సినిమాను ఎండ్ చేశారు.  మొత్తంగా   ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ లేని ఒక ఆహ్లాదకరమైన క్లీన్ మూవీని చూసిన సంతృప్తి కలుగుతుంది.


సాంకేతికంగా చూస్తే సినిమా నాచురల్‌గా విజువల్ వండర్‌గా ఉంది. సంగీతం బాగుంది. ప్రవీణ్ బొలిశెట్టి అందించిన పాటలు బాగున్నాయి. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. కొత్త నిర్మాత అయినప్పటికీ దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఎక్కడా రాజీ పడకుండా ఎంతో విలువలతో కూడిన ఈ చిత్రాన్ని నిర్మించడం అభినందనీయం అని చెప్పాలి.

నటీనటుల విషయానికొస్తే.. 
మాస్టర్ జయంత్ మంచి నటన కనబరిచాడు. ఏదో నటిస్తున్నట్టు కాకుండా నాచురల్‌గా సాగిపోతుంది.మొదటి సినిమానే అయినప్పటికీ ఎంతో ఈజీగా  నటించి మెప్పించాడు. నవ్వించాడు. కొన్ని సీన్స్‌లో కన్నీళ్లు పెట్టించాడు.  తండ్రి పాత్రలో ఆశిష్ గాంధీ చాలా సహజ సిద్ధమైన నటనతో ప్రాణం పోసాడు.  కనిపిస్తే, తల్లిగా మానస ఓకే అనిపిస్తుంది. ఇక తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, అశోక్ కుమార్ తమ అనుభవంతో పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సత్యం రాజేష్‌కు చాలా మంచి పాత్ర లభించింది. బేబీ ఊహ తెరపై ఎంతో క్యూట్‌గా కనిపించి మురిపించింది.  జయంత్ గ్యాంగ్ మరియు ఇతర బాల నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్: పిల్లలను మెప్పించే ‘జయంత్ అండ్ ద జింగో పెన్’

రేటింగ్: 3 / 5
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie