SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Katrina Kaif Body Shaming: హీరోయిన్ కత్రినా కైఫ్ బాడీ షేమింగ్..ట్రోలర్స్‌కు ఇచ్చి పడేసిన బాలీవుడ్ బ్యూటీ!

Katrina Kaif Body Shaming Trolls: ముంబైలోని అంబానీ నివాసంలో జరిగిన వినాయక చవితి వేడుకలకు భర్త విక్కీ కౌశల్‌తో కలిసి హాజరైన బాలీవుడ్ ప్రముఖ నటి కత్రినా కైఫ్‌పై సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయి. ప్రసవం తర్వాత ఆమె బరువు పెరిగారంటూ కొన్ని విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ప్రసవానంతరం మహిళల శరీరాకృతిపై సమాజం తెచ్చే ఒత్తిడి, నెటిజన్ల వ్యాఖ్యలపై ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తీవ్రంగా స్పందించారు.

Written By Harish Darla
Published: Nov 01, 2026, 07:47 AM IST | Updated: Nov 01, 2026, 07:48 AM IST
Join

Katrina Kaif Body Shaming Trolls: బాలీవుడ్ ప్రముఖ నటి కత్రినా కైఫ్ ఇటీవల తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అంబానీ నివాసంలో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు హాజరయ్యారు. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. తల్లి కావడం అనేది తన జీవితంలో ఒక అందమైన కొత్త ఆరంభమని, మనస్సులోని బలమైన కోరికను నెరవేర్చుకుంటూ ముందుకు సాగినప్పుడు మళ్లీ పాత శరీరాకృతి కోసం వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాగే తన ఫిట్‌నెస్ ప్రయాణం, శరీరం యాక్టివ్‌గా ఉండటంపై తనకు పూర్తి స్పష్టత ఉందన్నారు.

అయితే, ప్రసవానంతరం ఆమె రూపంలో వచ్చిన మార్పులను ఎత్తిచూపుతూ, కత్రినా చాలా బరువు పెరిగారంటూ నెటిజన్లలో కొందరు ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు ఆ ట్రోలింగ్‌ను తీవ్రంగా ఖండించడమే కాకుండా, కత్రినాకు బహిరంగంగా మద్దతుగా నిలిచారు.

అయితే తన శరీరాకృతిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కత్రినా కైఫ్, ప్రసవానంతరం మహిళలు వెంటనే తమ మునుపటి శరీరాకృతికి రావాలనే సామాజిక ఒత్తిడిపై ఘాటుగా స్పందించారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఒక మహిళ శరీరంలో ఎలాంటి సహజమైన మార్పులు సంభవిస్తాయో సమాజంలో చాలామందికి ముందే అవగాహన ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అంతా తెలిసి కూడా శరీరాకృతిపై ట్రోల్స్ చేయాలని భావిస్తే అది వారి వ్యక్తిగత నిర్ణయమేనని స్పష్టం చేశారు. ప్రసవానంతరం మహిళల శరీర మార్పుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.

తల్లి కావడం అనేది తన జీవితంలో సాధించిన ఒక గొప్ప ముందడుగు అని హీరోయిన్ కత్రినా కైఫ్ అభివర్ణించారు. "నా మనసులో ఎప్పటినుంచో ఉన్న ఒక బలమైన కోరికను నెరవేర్చుకుంటూ జీవితంలో ముందడుగు వేశాను. అలాంటప్పుడు మళ్లీ పాత రూపం కోసం వెనక్కి వెళ్లాలని ఎందుకు అనుకుంటాను?" అని ఆమె ప్రశ్నించారు. తల్లిగా మారడాన్ని తన జీవితంలో ఒక కొత్త ఆరంభంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన జీవితంలోని ఈ అందమైన దశపై, అలాగే భవిష్యత్తులో ముందుకు సాగాల్సిన ప్రయాణంపైనే తాను పూర్తి దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఫిట్‌నెస్ ప్రయాణంపై స్పష్టత..
తల్లయ్యాక ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం లేదంటూ వస్తున్న వ్యాఖ్యలను కూడా కత్రినా తోసిపుచ్చారు. ఫిట్‌నెస్ విషయంలో తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. "నా ఫిట్‌నెస్‌ ప్రయాణం గురించి, నా శరీరం ఎప్పుడు చురుగ్గా ఉంటుందనే విషయంపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది" అని ఆమె స్పష్టమైన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కత్రినా చేసిన ఈ ధీటైన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలు, సినీ వర్గాలు, మహిళల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES