తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..
Nana Patekar Telugu Movies: నానా పాటేకర్ రంగస్థల నటుడిగా వెండితెరపై ప్రవేశించి వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఈయనకు నటనతో పెట్టిన విద్య. ఈయనకు తెలుగు సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది.
Nana Patekar Movies Remade in Telugu: నానా పాటేకర్ ఈ పేరు వింటే ఈయన చేసిన పాత్రలే కళ్ల ముందు కదులుతాయి. బాలీవుడ్‌లో వైవిధ్యమైన నటనతో ఎంతో మంది అభిమాన పాత్రుడయ్యారు. హిందీ, మరాఠీ చిత్రసీమలో ఈయన చేసిన క్యారెక్టర్స్‌లో మరో నటుడిని ఊహించుకోలేము. ఈ రోజు ఉదయం ఆయన అంతిమ శ్వాస విడిచారు. ఆయన వయసు 75. గోవాలో ఈ రోజు (అక్టోబర్ 8) తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్‌తో ఈ లోకాన్ని విడిచివెళ్లినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నటుడిగా దర్శకుడిగా చిత్రసీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు తెలుగు సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈయన నటించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి.
‘క్రాంతి వీర్’ తెలుగులో ‘పుణ్యభూమి నా దేశం’..
1994లో మెహుల్ కుమార్ దర్శకత్వంలో ఈయన హీరోగా నటించిన ‘క్రాంతివీర్’ సినిమాను తెలుగులో మోహన్ బాబు హీరోగా ‘పుణ్యభూమి నా దేశం’ గా రీమేక్ చేశారు. ఈ సినిమాలోని నటనకు ఈయన జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. అందకు ముందు విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరిందా’లో అన్న పాత్రలోని నటనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. అటు ‘అగ్నిసాక్షి’లోని నటనకు కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు.
‘టాక్సీ నెం.9211’ తెలుగులో ‘గేమ్’..
ఇక మిలన్ లూథ్రియా దర్శకత్వంలో 2006లో ఈయన జాన్ అబ్రహం హీరోలుగా తెరకెక్కిన ‘టాక్సి నెంబర్ 9211’ సినిమాను తెలుగులో మోహన్ బాబు, మంచు విష్ణు హీరోలుగా ‘గేమ్’ పేరుతో రీమేక్ అయింది. ఈ సినిమా అంతగా నడవలేదు.
యశ్వంత్ - సంచలనం..
ఇక 1997లో అనిల్ మట్టో దర్శకత్వంలో తెరకెక్కిన ‘యశ్వంత్’ సినిమాను ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ .. ప్రకాష్ రాజ్, రోజా హీరో, హీరోయిన్లుగా ‘సంచలనం’ పేరుతో రీమేక్ చేశారు.
నట సమ్రాట్ మూవీ తెలుగులో రంగమార్తాండ..
ఇక 2016లో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఈయన కథానాయకుడిగా నటించిన మరాఠి చిత్రం ‘నట సమ్రాట్’ చిత్రాన్ని.. కృష్ణవంశీ తెలుగులో ప్రకాష్ రాజ్ హీరోగా ‘రంగమార్తండ’గా రీమేక్ చేశారు.
అంత:పురం - శక్తి
మరోవైపు కృష్ణవంశీ తెలుగులో తెరకెక్కించిన ‘అంత:పురం’ సినిమాను హిందీలో నానా పాటేకర్ చేశారు. తెలుగులో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రను హిందీలో నానా పాటేకర్ చేశారు. జగపతి బాబు రోల్‌ను షారుఖ్ ఖాన్ చేయడం విశేషం. తెలుగు నుంచి హిందీలో రీమేక్ అయిన ఒకే ఒక్క సినిమా ఇది.
కింగ్ - వెల్కమ్
ఇక నాగార్జున ‘కింగ్’సినిమాలో శ్రీహరి పాత్రకు ‘వెల్కమ్’ సినిమాలో నానా పాటేకర్ చేసిన ఉదయ్ శెట్టి పాత్రను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించడం విశేషం.