Payal Rajput On Radhika Apte: టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అదే విషయంపై మరో హీరోయిన్,'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ తీవ్రస్థాయిలో స్పందించింది. టాలీవుడ్ తనకు మంచి పేరు, గొప్ప గుర్తింపు ఇచ్చిందని ఆమె స్పష్టం చేసింది.
అలాగే రాధికా ఆప్టేకి కూడా తన కెరీర్‌కు బలమైన పునాది వేసిన తెలుగు పరిశ్రమను ఇన్నేళ్ల తర్వాత విమర్శించడం ధైర్యం అనిపించుకోదని, అది కేవలం అసహనం, అక్కసుకు నిదర్శనమని రాధికా ఆప్టేకు పాయల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలకు టాలీవుడ్ అభిమానుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.
ఇటీవల 'అక్క' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న బాలీవుడ్ నటి రాధికా ఆప్టే, దక్షిణాది చిత్ర పరిశ్రమపై, ముఖ్యంగా టాలీవుడ్ కమర్షియల్ సినిమాలలో కథానాయికల పాత్రలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలో నటీమణులకు తగిన ప్రాధాన్యత లభించదని, వారిని కేవలం గ్లామర్ ప్రదర్శన కోసమే వాడుకుంటారనే రీతిలో ఆమె ఆరోపణలు చేసింది. రాధికా ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌కు సంపూర్ణ మద్దతుగా నిలిచారు.
తెలుగు చిత్ర పరిశ్రమ తీరును సమర్థిస్తూ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. టాలీవుడ్ ఎంతో క్రమశిక్షణతో కూడుకున్న పరిశ్రమ అని, ఇక్కడ నటీనటులకు ఎంతో గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు. "నేను తెలుగు నటిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. నా కెరీర్‌కు పునాది వేసి, నన్ను ఆదరించి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఇండస్ట్రీ గురించి అనేక సంవత్సరాల తర్వాత ఇలా చెడుగా మాట్లాడటం ఎంతమాత్రం ధైర్యం అనిపించుకోదు. అది కేవలం వ్యక్తిగత అసహనం, అక్కసుకు మాత్రమే నిదర్శనం" అని పాయల్ సూటిగా విమర్శించింది.
తన కష్టకాలంలో తనకు అండగా నిలిచిన తెలుగు ఇండస్ట్రీకి తాను ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటానని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తేల్చిచెప్పింది. ఏ రంగానికైనా లేదా పరిశ్రమకైనా సరే, అక్కడ లభించే అవకాశాలను, పడే శ్రమను, ఆ పరిశ్రమ సంస్కృతిని గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని పాయల్ గుర్తుచేసింది.
టాలీవుడ్ ప్రేక్షకులు తనపై చూపే అపరిమితమైన ప్రేమను తాను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని ఆమె స్పష్టం చేశారు. పాయల్ రాజ్‌పుత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమ గౌరవాన్ని కాపాడుతూ పాయల్ రాజ్‌పుత్ తీసుకున్న ఈ ధీటైన స్టాండ్‌ను టాలీవుడ్ అభిమానులు, సినీ ప్రేమికులు, నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తూ ఆమెకు తమ పూర్తి మద్దతును తెలియజేస్తున్నారు.