SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రణబాలి 2 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విజయ్ ముందు కొండంత టార్గెట్..

Ranabaali 2 Box Office Collections: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్న జోడీగా తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం రణబాలీ. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరక్కిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమ తొలి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 18, 2026, 08:06 AM IST | Updated: Oct 18, 2026, 08:11 AM IST
Image Credit: Ranabaali Collections (X/Source)
Join

Ranabaali Box Office Dandayatra: గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేదు. ఇక పెళ్లి తర్వాత తన జీవిత భాగస్వామి రష్మిక మందన్న జోడి కట్టడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.  భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా, తొలి రోజు మంచి వసూళ్లను రాబట్టింది. కెరీర్ పరంగా రణబాలి విజయ్‌కు ఎంతో కీలకంగా మారింది. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు రౌడీ హీరో.

చారిత్రక నేపథ్యం. 
చారిత్రక నేపథ్యంలో సాగే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రణబాలీ'ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలోని యాక్షన్ సీన్లు, విజయ్ దేవరకొండ వారియర్ లుక్ ఈ సినిమాకు ప్లస్‌గా నిలియాయి. సిపాయిల తిరుగుబాటు తర్వాత దక్షిణాదిలో బ్రిటిష్ వాళ్లు కరువు, క్షామం తాండవం చేస్తున్న సమయంలో మన వాళ్ల దగ్గర తిండి గింజలను శిస్తుగా కట్టించుకొని వారిని కట్టు బానిసలుగా తమకు సంబంధించిన రైల్వే లైన్‌ పనుల్లో పెట్టుకోవడం. ఈ సందర్భంగా అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు.

రణబాలి బాక్సాఫీస్ దండయాత్ర..
ఈ సినిమా తొలి రోజు దాదాపు రూ. 10 కోట్ల షేర్ (రూ. 20 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో రోజు కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ఈవెనింగ్, నైట్ షోలకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓవరాల్‌గా రెండు రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8 కోట్ల షేర్ (రూ.16 కోట్ల) వసూళ్లను రాబట్టినట్టు చెబుతున్నారు. ఓవరాల్‌గా రెండు రోజుల్లో రూ. 18 కోట్ల షేర్ (రూ. 36 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. పోటీలో జైలర్ 2 నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఇస్తుంది. అయిన  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.రూ. 43 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇంకా రూ. 24 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది.

దసరా సెలవుల అడ్వాంటేజీ.. 
ఈ రోజు ఆదివారంతో పాటు దసరా సెలవులు ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి. ఈ సినిమా ఓవర్సీస్‌లో అర మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన వన్ మిలియన్ వైపు అడుగులు వేస్తుంది. లాంగ్ వీకెండ్ కావడంతో రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES