• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Ranabaali Documentary: థియేటర్స్‌లోకి రాకముందే ఓటీటీలో రణబాలి హంగామా.. విజయ్, రష్మిక దిమ్మతిరిగే ప్లాన్..!

Ranabaali Documentary: థియేటర్స్‌లోకి రాకముందే ఓటీటీలో రణబాలి హంగామా.. విజయ్, రష్మిక దిమ్మతిరిగే ప్లాన్..!

Ranabaali Documentary: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Written ByVishnu Priya
Published: Sep 27, 2026, 06:26 PM IST|Updated: Sep 27, 2026, 06:30 PM IST
joinshare
Ranabaali Documentary: థియేటర్స్‌లోకి రాకముందే ఓటీటీలో రణబాలి హంగామా.. విజయ్, రష్మిక దిమ్మతిరిగే ప్లాన్..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ranabaali Documentary: సినిమా విడుదలకు ఇంకా కొంత సమయం ఉండగానే మేకర్స్ కొత్త ప్రమోషన్ ప్లాన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాటలు, టీజర్, ట్రైలర్, ఇంటర్వ్యూలు విడుదల చేస్తుంటారు. అయితే రణబాలి టీమ్ మాత్రం కథకు సంబంధించిన నేపథ్యాన్ని ప్రేక్షకులకు ముందుగానే పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా రణబాలి: నెవర్ ఫర్‌గెట్ ది ట్రూత్ పేరుతో నాలుగు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌ను తీసుకొస్తున్నారు. ఈ డాక్యుమెంటరీలో సినిమా కోసం జరిగిన పరిశోధన, కథకు సంబంధించిన చారిత్రక అంశాలు, షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలు, సినిమా రూపొందిన విధానం వంటి విషయాలను చూపించనున్నారు.

ఈ సిరీస్‌లో మొదటి ఎపిసోడ్ ది ఫెమైన్ వి ఫర్‌గాట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. రెండో భాగం ది హిస్టరీ వి ఫర్‌గాట్ సెప్టెంబర్ 30న వస్తుంది. మూడో ఎపిసోడ్ ది మెన్ వి ఫర్‌గాట్ అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. నాలుగో భాగానికి ది లాస్ట్ లోడ్ అనే పేరు పెట్టారు.

ఈ డాక్యుమెంటరీ ద్వారా 19వ శతాబ్దంలోని బ్రిటిష్ పాలన, అప్పటి కరువు పరిస్థితులు, సామాన్య ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు వంటి అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం.

ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలోకి వస్తున్నప్పటికీ రణబాలి సినిమా మాత్రం ముందుగానే ఓటీటీలో విడుదల కావడం లేదు. సినిమా నేపథ్యంపై రూపొందించిన ప్రత్యేక కంటెంట్ మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

ఇప్పటివరకు వచ్చిన టీజర్, పాటలను బట్టి చూస్తే రణబాలి కథ బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ శింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

సినిమా కథ వెనుక ఉన్న చరిత్రను ముందుగానే పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడమే మేకర్స్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అక్టోబర్ 16న సినిమా విడుదలైన తర్వాత ఈ కొత్త ప్రమోషన్ విధానం ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.


Also Read: Peddi Vs The Paradise: మెగా ఫ్యామిలీపై ఎందుకంత ఏడుపు? 'పెద్ది' Vs 'ది ప్యారడైజ్'..టాలీవుడ్‌లో ద్వంద వైఖరికి పరాకాష్ట!

Also Read: Paradise Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో 'ది ప్యారడైజ్' సినిమా రగడ.. కాంగ్రెస్ Vs బీఆర్‌ఎస్ హంగామా!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tollywood
Telugu Movie