SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దేశమంతా రణబాలి హవా.. విజయ్ దేవరకొండ, రష్మిక మూవీ ఫస్ట్ రివ్యూ..

Ranabaali Sensation: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లి తర్వాత తొలిసారి వెండితెరపై జోడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ మూవీ ‘రణబాలి’పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంకృత్యాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 08, 2026, 05:21 AM IST | Updated: Oct 08, 2026, 05:22 AM IST
Image Credit: Ranabaali Promotions (ZEE News Telugu/Source)
Join

Ranabaali: విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే రణబాలి పూర్తిగా భిన్నమైన జోనర్‌లో ఉండబోతుంది. తొలిసారి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాని తోడు భారీ స్థాయి విజువల్స్, విభిన్నమైన కథాంశం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని తెలుస్తోంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ గతంలోనే తన సినిమాలతో కొత్త తరహా కథలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీంతో రణబాలిపై కూడా అంచనాలు మరింత పెరిగాయి.

ఇక ఈ సినిమాను కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ భారీ ప్లానింగ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండకు తెలుగు మార్కెట్‌తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉండటం, రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ సినిమాకు అదనపు బలంగా మారే అవకాశాలున్నాయి.

ముఖ్యంగా బాలీవుడ్, తమిళ్, కన్నడ మార్కెట్లలో కూడా విజయ్, రష్మికలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే రణబాలి ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నార. సినిమా విడుదలకు ముందు చివరి దశ వరకు వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ  సినిమా కథకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.

నేటి నుంచి ట్రైలర్ లాంచ్‌తో రణబాలి ప్రమోషన్స్ మరింత వేగం అందుకోబోతున్నాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాకు సంబంధించిన కథ, విజయ్ దేవరకొండ పాత్ర, రష్మిక క్యారెక్టర్‌తో పాటు సినిమా ప్రపంచం ఎలా ఉండబోతుందనే దానిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రైలర్‌కు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్..

అంతేకాదు, విడుదల తేదీకి ముందు వరకు వరుస ప్రమోషనల్ యాక్టివిటీస్ నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మార్కెట్లలో ప్రత్యేకంగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాను వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

ఒక సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావాలంటే కేవలం స్టార్ హీరో ఉండటం మాత్రమే సరిపోదు. కథ, కంటెంట్, మేకింగ్, ప్రమోషన్స్ అన్నీ కలిసి పనిచేయాలి. కలిసి రావాలి. రణబాలి విషయంలో ఈ అంశాలన్నింటినీ పర్ఫెక్ట్‌గా కలిపేందుకు టీమ్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హిస్టారికల్ కథ కావడంతో నార్త్ ఇండియా మార్కెట్‌లో కూడా సినిమాకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్, రష్మిక జోడి.. 

ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ఆయన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆయనకు ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రష్మికకు కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండటంతో ఈ కాంబినేషన్ సినిమాకు ప్లస్ పాయింట్‌ అని చెప్పాలి. ఈ యేడాది ఫిబ్రవరిలో ఒకటైన ఈ జంట పెళ్లి తర్వాత కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ప్యాన్ ఇండియా మార్కెట్.. 
ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. రణబాలి పాన్ ఇండియా మార్కెట్‌లో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా? విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందా? హిస్టారికల్ జోనర్‌లో రాహుల్ సంకృత్యాన్ తన మార్క్ చూపించగలరా? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

ట్రైలర్ పై అంచనాలు..

ప్రస్తుతం మాత్రం రణబాలి చుట్టూ ఉన్న హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. ట్రైలర్ ఎలా ఉండబోతోంది, ప్రమోషన్స్ ఏ స్థాయిలో జరుగుతాయి, ఇతర భాషల ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే అంశాలు సినిమాకు కీలకంగా మారనున్నాయి.

మొత్తానికి విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో కీలకమైన సినిమాగా ‘రణబాలి’ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భారీగా వస్తున్న ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. ఇప్పటికైతే మాత్రం రణబాలి కోసం విజయ్ అభిమానులు మాత్రమే కాదు.. పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES