Ragina Cassandra: నచ్చకుంటే తప్పుకొవచ్చు.. రాధికా ఆప్టే కామెంట్స్ కు ఇచ్చిపడేసిన రెజీనా కసాండ్రా.. ఇండస్ట్రీలో రచ్చ..
Ragina Cassandra fires on Bollywood: నటి రాధికా ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలపై సెలబ్రీటీలు తమదైన స్టైల్ లో కౌంటర్ లు ఇస్తున్నారు. మూవీ నచ్చకుంటే ప్రాజెక్ట్ నుంచి తప్పుకొవచ్చని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ విధంగా విమర్శలు చేయడం సరికాదన్నారు.
Regina Cassandra fires on Bollywood: ఇటీవల తరచుగా హీరోయిన్ లను టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ గా చేసి విమర్శలు చేయడం తీవ్ర వివాదాస్పంగా మారింది. జాన్వీకపూర్ ఇటీవల పెద్ది మూవీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కొన్ని కెమెరా యాంగిల్స్, సన్నివేశాలు కేవలం గ్లామర్ కు మాత్రమే చూపించేలా ఉన్నాయని మాట్లాడారు. ఈ మూవీలోని కొన్నిసీన్లలో తొలుత అంగీకరించిన ఆ తర్వాత పశ్చాత్తాప పడుతున్నట్లు ఈ గిల్ట్ తనను జీవితాంతం వెంటాడుతుందన్నారు. మరోవైపు రాధికా ఆప్టే సైతం అక్కా మూవీ ప్రమోషన్లలో భాగంగా గతంలో బాలయ్యతో చేసి లెజెండ్ మూవీపై విమర్శలు చేశారు. గతంలో తన కన్నా వయసులో చాలా పెద్ద హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చిందన్నారు. అంతే కాకుండా తన మామను పెళ్లాడాల్సి వచ్చిందన్నారు.
కొన్నిసీన్లలో చాలా ఇబ్బంది పడ్డాడని కరణ్ షోలో మాట్లాడారు. దీనిపై టాలీవుడ్ లో దుమారం రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై పాయల్ రాజ్ పూత్ ఫైర్ అయ్యారు. అవకాశాలు పొంది మంచి ఫెమ్ వచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీని విమర్శించడంను తీవ్రంగా ఖండించారు. నచ్చక పొతే తప్పుకొవాలని, ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా.. నటి రెజీనా కాసాండ్రా సైతం టాలీవుడ్ పై వరుసగా హీరోయిన్లు విమర్శించడంను తప్పుపట్టారు.
రెజీనా కసాండ్రా ‘కేసరి చాప్టర్ 2’ సినిమా ప్రమోషన్లలోతనను కావాలని పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే విధంగా కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌పై తీవ్ర విమర్శలు చేశారు.తాను సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటి కావడం వల్లనే తనను పక్క పెట్టారని ఎమోషనల్ అయ్యారు. కేసరి 2లో అక్షయ్ కుమార్ కు భార్యగా నటించిన కీలక పాత్ర పోషించిన కూడా తన పేరును తొలగించడం ఎంత వరకు కరెక్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో రాధికా ఆప్టే వివాదంపై స్పందిస్తు.. ఒక వేళ సౌత్ లో సినిమాలు నచ్చకుంటే ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకొవచ్చన్నారు. కానీ ఈ విధంగా విమర్శలు చేయడం సరికాదని రాధికా ఆప్టేకు ఇచ్చిపడేశారు. ప్రస్తుతం రెజీనాకు బాలీవుడ్ లో ఎదురైన చేదుఅనుభం కాస్త వార్తలలో నిలిచింది. దీంతో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లు నెట్టింట రచ్చ రాజుకుంది.