• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /తెలుగు తెరపై మరో డిఫరెంట్ యాక్షన్ లవ్ స్టోరీ ‘సిద్దు గాడి లవ్ స్టోరీ’.. ఈ నెల 27న విడుదల..

తెలుగు తెరపై మరో డిఫరెంట్ యాక్షన్ లవ్ స్టోరీ ‘సిద్దు గాడి లవ్ స్టోరీ’.. ఈ నెల 27న విడుదల..

Siddu Gadi Love Story: తెలుగు సినిమా ఓ పుష్పక విమానం వంటిది. ఇంకా ఎంత మంది దర్శక, నిర్మాతలు, నటీనటులున్న కొత్తవాళ్లకు ఎపుడు చోటు ఉంటుంది. తాజాగా తెలుగు సినిమాపై ఉన్న మమకారంతో అమెరికా నుంచి నుంచి వచ్చిన ఓ ఎన్‌ఆర్ఐ దర్శకుడిగా మారి ‘సిద్దు గాడి లవ్ స్టోరీ’ అంటూ ఓ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 22, 2026, 10:25 IST|Updated: Nov 23, 2026, 15:29 IST
joinshare
తెలుగు తెరపై మరో డిఫరెంట్ యాక్షన్ లవ్ స్టోరీ ‘సిద్దు గాడి లవ్ స్టోరీ’.. ఈ నెల 27న విడుదల..
Image Credit: siddu gaadi love story (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Bandi Sanjay: నబిన్ చూపుల్లో ‘వాడి’ ఉంది.. కరీంనగర్ మహాపాదయాత్రలో బండి సంజయ్ సెన్సెషనల్ కామెంట్స్..

Bandi Sanjay: నబిన్ చూపుల్లో ‘వాడి’ ఉంది.. కరీంనగర్ మహాపాదయాత్రలో బండి సంజయ్ సెన్సెషనల్ కామెంట్స్..

2

పాన్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. పాత, బ్లర్ ఫోటోతో KYC ఇబ్బందులా? మొబైల్‌లోనే 5 నిమిషాల్లో మార్చుకోండిలా!

3

మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

4

డైరెక్టర్ క్షమాపణలు..! స్కిన్ షో వద్దన్న హీరోయిన్..! ఏమిటా కాంట్రవర్సీ..

5

మంచు విష్ణుతో ప్రభుదేవా మాస్టర్ ప్లాన్..! ఈ సారైన వర్కౌట్ అయ్యేనా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Siddu Gadi Love Story Release Date: తెలుగు సినిమా అంటే ఎంతో అభిమానంతో సప్త సముద్రాలు దాటి తెలుగు చిత్ర సీమలో దర్శకుడిగా  ఎంట్రీ ఇచ్చాడు రమేష్ చెరుకూరి.  అమెరికాలో ఉద్యోగం చేస్తూనే తెలుగు సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి “సిద్ధుగాడి లవ్ స్టోరీ” చిత్రాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రూపొందించారు. సినిమా  కేవలం వినోదం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ఒక కల అని చెప్పుకొచ్చారు. ఉద్యోగం ఒకవైపు, సినిమా మరోవైపు అయినప్పటికీ తన అభిరుచికి సమయం కేటాయిస్తూ, తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించాలనే సంకల్పంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు.

విదేశాల్లో ఉన్నప్పటికీ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు సినిమా పట్ల అభిమానం ఆయన్ని సినిమా తీసేలా పురికొల్పింది.  అంతేకాదు  తన ఆలోచనలకు వెండితెర రూపం ఇవ్వాలనే లక్ష్యంతో దర్శకుడిగా బుడి బుడి అడుగులను వడివడిగా వేస్తున్నారు. తన ఆలోచనలు, అనుభవం, క్రియేటివిటీతో  ప్రేక్షకులకు మంచి ప్రేమకథను అందించాలనే ప్రయత్నంలో భాగంగా  “సిద్ధుగాడి లవ్ స్టోరీ” సినిమాను తెరకెక్కించాడు.

శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు,  శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో, నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 27 న విడుదలకు రెడీ అవుతుంది.

ఈ చిత్రంలో హీరోగా మనోజ్ యాక్ట్ చేస్తున్నారు. హీరోయిన్లుగా శృతి, మోహన సిద్ధి యాక్ట్ చేశారు. హీరో తండ్రి పాత్రలో సుమన్, విలన్ పాత్రలో సర్కార్ యాక్ట్ చేశారు.  ప్రముఖ హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు కూడా ఈ చిత్రంలో యాక్ట్ చేశారు. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ..  “నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదన్నారు. నా మనసులో ఉన్న సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.  ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులతో మంచి డైరెక్టర్‌గా  గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.  అలాగే టీజర్ మంచి రెస్పాన్స్ రావడంతో చాలా హ్యాపీగా ఉందని తెలిపారు.తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, మీడియా మిత్రులు ఈ కొత్త  ప్రయత్నాన్ని ఆదరించి ప్రోత్సహించాలని చిత్ర బృందం కోరుకుంటోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie