Item Songs: అవును ఇపుడు సీనియర్ భామలకు ఐటెం సాంగ్స్ వరంగా మారుతున్నాయి. కాస్త గ్యాప్ వచ్చిన హీరోయిన్స్ ఐటెం పాటలతో చెలరేగిపోతున్నారు. తాజాగా ఈ శుక్రవారం విడుదలైన ‘సిగ్మా’లో కేథరిన్ థ్రెసా స్పెషల్ ఐటెం సాంగ్ చేసింది. తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తొలిసారి మెగాఫోన్ పట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. సందీప్ కిషన్ హీరోగా నటించాడు.
ఐటెం భామగా కీర్తి..
గత వారం నాని హీరోగా తెరకెక్కిన తెరకెక్కిన ‘ప్యారడైజ్’ మూవీలో కీర్తి సురేష్.. ‘యేశనాగుల’ పాటకు వేసిన చిందులకు టాకీస్‌లు దద్దరిల్లిపోయాయి. ఈ పాట అతి తక్కువ టైమ్‌లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది. ఈ సినిమాకు ఈ ఐటెం పాట పెద్ద ఎస్సెట్‌గా నిలుస్తుంది.
తమన్నా..
‘బాహుబలి’ సిరీస్‌తో తమన్నా ప్యాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమెకు తెలుగులో కంటే బాలీవుడ్‌లోనే వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఓ రకంగా తమన్నా హీరోయిన్‌గా తక్కువైపోయి.. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తోనే పబ్బం గడిపేస్తోంది. ఆమె కెరీర్‌ను ఈ ఐటెం సాంగ్స్ కాపాడుతున్నాయంటే అతిశక్తి కాదు..
శృతి హాసన్..
శృతి హాసన్ కూడా ఈ మధ్యే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’లో హెల్లెల్లో అంటూ పలకరించారు.. ఆ మధ్య నాని హాయ్ నాన్నలోనూ స్పెషల్ సాంగ్ చేసి మురిపించింది. ఈమె మొదటి సారి మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఆగడు’ సినిమాలో ఐటెం సాంగ్‌లో కనిపించింది. ఇపుడు అడపదడపా ఐటెం సాంగ్స్ చేస్తూ కాలక్షేపం చేస్తుంది.
సమంత..
అవును సమంత.. కూడా అప్పట్లో ‘పుష్ప’లో ‘ఊ అంటవా మావ ఊహూ అంటావా’ పాటలో ఎలాంటి మాయ చేసిందో తెలిసిందే. ఈ పాట ప్యాన్ ఇండియా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తప్పించి మరే సినిమాలో సమంత.. ఐటెం సాంగ్ చేయలేదు. రీసెంట్‌గా రెండో పెళ్లి తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
శ్రీలీల..
శ్రీలీల కూడా కెరీర్‌లో మొదటి సారి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’లో ‘దెబ్బలు పడతయ్ రో’ సాంగ్‌లో ఇరగదీసింది. మొత్తంగా హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేసి తమ ఉనికి చాటుకుంటున్నారు.