• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Srikanth Odela: మగధీరలో గుర్రానికి లేని లాజిక్.. నా సినిమాలో కుక్కకు ఎందుకు?

Srikanth Odela: మగధీరలో గుర్రానికి లేని లాజిక్.. నా సినిమాలో కుక్కకు ఎందుకు?

Srikanth Odela: ‘ది ప్యారడైజ్’లో కుక్క సీన్‌పై వస్తున్న ట్రోల్స్‌కు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఘాటుగా స్పందించారు. ‘మగధీర’లోని గుర్రం సీన్‌ను ఉదాహరణగా చెబుతూ సినిమాను కేవలం లాజిక్‌తో కాకుండా ఎమోషన్‌తో చూడాలని అన్నారు.

Written ByVishnu Priya
Published: Sep 27, 2026, 10:07 PM IST|Updated: Sep 27, 2026, 10:12 PM IST
joinshare
Srikanth Odela: మగధీరలో గుర్రానికి లేని లాజిక్.. నా సినిమాలో కుక్కకు ఎందుకు?

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Srikanth Odela: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా కథ, నాని నటన, యాక్షన్ సీన్లతో పాటు కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలో కుక్కకు సంబంధించిన ఒక సీన్‌పై కొందరు నెటిజన్లు లాజిక్ గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందించారు.

‘ది ప్యారడైజ్’లో కుక్క దేవుడికి దండం పెట్టడం, హీరోకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో కనిపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సీన్లను కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు నిజ జీవితంలో సాధ్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ విమర్శలకు శ్రీకాంత్ ఓదెల ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాను ఉదాహరణగా తీసుకున్నారు. తాను రాజమౌళితో తనను పోల్చుకోవడం లేదని ముందుగానే చెప్పారు. అయితే సినిమాను కేవలం లాజిక్‌తో మాత్రమే చూడకూడదని వివరించారు.

‘మగధీర’ సినిమాలో గుర్రానికి సంబంధించిన ఒక సీన్‌ను ఆయన గుర్తు చేశారు. ఆ సన్నివేశంలో గుర్రం చేసే పని నిజ జీవితంలో సాధ్యమా అనే ప్రశ్న కంటే, ఆ సీన్‌ను ప్రేక్షకులు ఎలా ఆస్వాదించారన్నదే ముఖ్యమని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు ఆ సన్నివేశానికి విజిల్స్ వేశారని గుర్తు చేశారు.

అదే విధంగా ‘ది ప్యారడైజ్’లో కుక్క సీన్ వెనుక కూడా ఒక ఎమోషన్ ఉందని శ్రీకాంత్ తెలిపారు. చిన్నప్పుడు హీరోను పోలీసులు తీసుకెళ్లే సమయంలో కుక్క అతని వెనుక పరిగెడుతుందని చెప్పారు. ఆ తర్వాత హీరో జైలులో ఉంటే, కుక్క బయట అతని కోసం చాలా కాలం ఎదురుచూస్తుందని వివరించారు.

అలాగే తన యజమాని దేవుడికి దండం పెట్టడాన్ని కుక్క తరచూ చూసేదని, అందుకే ఆ చర్యను అది కూడా నేర్చుకున్నట్లు సినిమాలో చూపించామని చెప్పారు.

అయితే ఈ సీన్ వెనుక ఉన్న పూర్తి బ్యాక్‌స్టోరీ ప్రేక్షకులకు సరిగ్గా అర్థమయ్యేలా తెరపై చూపించడంలో కొంత లోపం జరిగి ఉండొచ్చని శ్రీకాంత్ అంగీకరించారు. కానీ ఆ సీన్ వెనుక ఉన్న ఆలోచనలో తప్పు లేదని స్పష్టం చేశారు.

సినిమా అంటే కేవలం లాజిక్ మాత్రమే కాదని, ఎమోషన్, ఊహ, సినిమాటిక్ లిబర్టీ కూడా ముఖ్యమని శ్రీకాంత్ ఓదెల చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Peddi Vs The Paradise: మెగా ఫ్యామిలీపై ఎందుకంత ఏడుపు? 'పెద్ది' Vs 'ది ప్యారడైజ్'..టాలీవుడ్‌లో ద్వంద వైఖరికి పరాకాష్ట!

Also Read: Paradise Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో 'ది ప్యారడైజ్' సినిమా రగడ.. కాంగ్రెస్ Vs బీఆర్‌ఎస్ హంగామా!
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tollywood
Telugu Movie