SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Srinidhi Shetty: యష్ కంటే నానినే బెస్ట్ అంటున్న శ్రీనిధి.. అసలు కారణం ఇదే!

Srinidhi Shetty: కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి యష్, నాని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇద్దరి వ్యక్తిత్వాల్లో ఉన్న తేడాలను చెబుతూ, నానితో కలిసి పనిచేసిన సమయంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను కూడా గుర్తుచేసుకుంది.

Written By Vishnu Priya
Published: Oct 05, 2026, 03:25 PM IST | Updated: Oct 05, 2026, 03:31 PM IST
Join

Srinidhi Shetty: ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. యష్ సరసన నటించిన ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ‘కేజీఎఫ్’ స్థాయిలో మరో భారీ విజయం ఆమెకు దక్కలేదు. ప్రస్తుతం ఆమె వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీనిధి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు యష్, నాని గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

తన జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం ఏదని అడిగినప్పుడు సినిమాల్లోకి రావడమే తన బెస్ట్ డెసిషన్ అని శ్రీనిధి చెప్పింది. తాను అప్పట్లో చేస్తున్న ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి సినిమాల్లోకి అడుగుపెట్టడం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపింది. అలాగే యష్, నాని ఇద్దరూ తనకు చాలా ప్రత్యేకమైన వ్యక్తులని చెప్పింది. యష్ తన తొలి కన్నడ హీరో కాగా, నాని తన మొదటి తెలుగు కో-స్టార్ అని గుర్తు చేసుకుంది. అందుకే ఇద్దరితోనూ తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పింది.

అయితే ఇద్దరి వ్యక్తిత్వాలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయని శ్రీనిధి తెలిపింది. యష్ చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారని, ఎక్కువగా మాట్లాడరని చెప్పింది. సెట్స్‌లో అప్పుడప్పుడు సరదాగా ఉండేవారని పేర్కొంది. ఇక నాని మాత్రం యష్‌కు పూర్తి భిన్నమని శ్రీనిధి చెప్పింది. నాని చాలా మాట్లాడుతారని, సెట్లో ఎప్పుడూ సరదాగా ఉంటారని తెలిపింది. జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తారని, తనను కూడా తరచూ ఆటపట్టిస్తూ ఉంటారని చెప్పింది.

‘హిట్’ సినిమా ఈవెంట్‌లో నానితో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను కూడా శ్రీనిధి గుర్తుచేసుకుంది. స్టేజ్‌పై ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఆటపట్టించుకున్న సమయంలో ఓ కెమెరామెన్ ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేశాడట. ఈవెంట్ పూర్తయ్యేలోపే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని ఆమె తెలిపింది.ఈ విషయాలను శ్రీనిధి సరదాగా చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Read More: Janhvi Kapoor: టాలీవుడ్‌లోకి అనవసరంగా వచ్చిన జాన్వీ కపూర్.. వరుస వివాదాలతో పెరుగుతున్న డ్యామేజ్!

Read More: ఎంటర్ ది ‘డ్రాగన్’ .. మళ్లీ షూటింగ్‌ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES