• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /పెళ్లి తర్వాత ‘రణబాలి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్, రష్మిక జంట..

పెళ్లి తర్వాత ‘రణబాలి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్, రష్మిక జంట..

Vijay Devarakonda Rashmika Mandanna Enjoy Ranabaali Success : విజయ్ దేవరకొండ కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాల్లో డిపరెంట్ పాత్రలతో అలరిస్తూ దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. కథానాయిక రష్మిక మందన్న ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతుంది. ఈ యేడాది మొదట్లో వీరిధ్దరు పెళ్లితో ఒకటయ్యారు. అంతేకాదు మ్యారేజ్ తర్వాత తొలిసారి కలిసి నటించిన ‘రణబాలి’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 19, 2026, 01:40 PM IST|Updated: Oct 19, 2026, 01:45 PM IST
joinshare
పెళ్లి తర్వాత ‘రణబాలి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్, రష్మిక జంట..
Image Credit: Virosh (File Pic/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
‘జైలర్ 2’ సహా 2026లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు ఇవే..

‘జైలర్ 2’ సహా 2026లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు ఇవే..

2

తెలంగాణలో 50 డిగ్రీలకు చేరనున్న ఎండలు? రైతులకు మంత్రి తుమ్మల కీలక హెచ్చరిక!

3

దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఈ ప్రాంతాల్లో మద్యం ఎందుకు సమర్పిస్తారు?

4

డీ గ్లామర్ రోల్స్‌కు ఓకే చెబుతున్న హీరో, హీరోయిన్లు..

5

Devi Dussehra Navratri: విజయ దశమి.. ఈ రెండు ఇంటికి తెచ్చుకుంటే దుర్గమ్మ ఆశీస్సులతో ఏడాదంత గొప్ప శుభయోగాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijay Devarakonda - Rashmika Mandanna Ranabaali: విజయ్ దేవరకొండ తెలుగులో తక్కువ టైమ్‌లో పౌరాణిక, చారిత్రక, బయోపిక్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో అవకాశం రావడం మాములు విషయం కాదు. ఇక పెళ్లి తర్వాత విజయ్, రష్మికలు జోడిగా నటించిన చారిత్రక చిత్రం ‘రణబాలి’ సినిమా మంచి వసూల్లతో దూసుకుపోతుంది. గతంలో వీరిద్దరి కలయికలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’  సినిమాల్లో నటించారు. ఇక వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది. 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న  హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వీరిద్దరి కెరీర్‌లోనూ ఓ మైలురాయిగా నిలిచేలా ‘రణబాలి’  ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్ర‌తీ షోకు సినిమాకు క‌లెక్ష‌న్స్ పెరుగుతుండ‌ట‌మే ఈ సినిమా స‌క్సెస్‌కు నిద‌ర్శ‌నం. విజయ్ దేవరకొండ నటన, ఆయన ఎంచుకున్న పాత్ర, తెరపై చూపించిన వైవిధ్యమైన నటన గురించి ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయ‌న ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా ‘రణబాలి’లో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

నటుడిగా ఓ మూసకు పరిమితం కానీ విజయ్.. 

కథానాయకుడిగా ఓక మూసకు పరిమితం కాకుండా నటుడిగా  కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ర‌ణ‌బాలి చిత్రం మరోసారి ‌ఋజువు చేసిందనే చెప్పాలి. రాయలసీమ యాసలో స్వాతంత్య్ర సమరయోధుడిగా విజయ్ దేవరకొండ నటనకు మంచి మార్కులే పడ్డాయి.  ముఖ్యంగా పాత్ర కోసం ఆయన చూపించిన డేడికేష‌న్‌, తెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం సినిమాకు స్పఎసల్ అట్రాక్షన్‌గా నిలిచిందనే చెప్పాలి.

ప్రస్తుతం యంగ్ స్టార్స్‌కు భిన్నంగా విజయ్ దేవరకొండ మాత్రం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయడం విశేషమనే చెప్పాలి.  సాధారణంగా యువ కథానాయకులు చేయడానికి ఆసక్తి చూపని భిన్నమైన రోల్‌ను ఎంచుకోవడం విశేషం. చిరంజీవి కూడా తన కెరీర్‌లో 40 యేళ్ల సినీ కెరీర్ తర్వాత చారిత్రక పాత్రలో నటించారు. కానీ విజయ్ నటుడిగా అడుగుపెట్టిన 10 యేళ్లలోనే ఈ తరహా పాత్రలో కనిపించడం విశేషం.

పెళ్లి తర్వాత తొలి సక్సెస్.. 
క్రమంలో ‘రణబాలి’ విజయ్‌లోని నటుడిని మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నిలుస్తోంది. మరోవైపు రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ జోడీ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. వీరిద్దరి కలయికకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, సినిమా చుట్టూ కొనసాగుతున్న చర్చలు ‘రణబాలి’కి కలిసొచ్చింది.

‘రణబాలి’ విషయంలో విజయ్ దేవరకొండ చేసిన ఎక్స్‌పెరిమెంట్‌, ఆయన నటనకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌స్తోంది. దేశ‌భ‌క్తిని పెంపొందించే పాత్ర‌లో ఆయ‌న ఒదిగిన తీరుకి జ‌నం నీరాజ‌నాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెరపై  చూడ‌ని సరికొత్త విజయ్‌ను చూస్తున్నామ‌ని ప్రేక్షకులు సాహో అంటూ  జేజేలు కొడుతున్నారు. మొత్తంగా చూస్తే, ‘రణబాలి’ విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో భిన్నమైన ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి.  అంేతకాదు  విజయ్ దేవరకొండ, ర‌ష్మిక‌ల‌కు ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింద‌న‌టంలో సందేహం లేదు. ఇక రణబాలి సినిమా మూడు రోజుల్లో రూ. 26 కోట్ల షేర్ (రూ. 45 కోట్ల గ్రాస్)వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  

బతుకమ్మ వేడుకల్లో విరోష్ జంట.. 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో విరోష్ జంట సద్దుల బతుకమ్మ వేడుకల్లో  సందడి చేశారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. స్టార్ జంట వేడుకల్లో పాల్గొనడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. పెళ్లి తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని రష్మికకు తాను ముందే చెప్పానని విజయ్ దేవరకొండ.. వివాహానంతరం తనకు ఇదే తొలి బతుకమ్మ పండుగ.  దీంతో విరోష్ అభిమానుల్లో ఆనందోత్సహాలు నెలకొన్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News