SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ranabali: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ‘రణబలి’ రిలీజ్‌పై వచ్చేసిన క్లారిటీ!

విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రణబలి’ విడుదలపై వస్తున్న పుకార్లకు మేకర్స్ చెక్ పెట్టారు. అక్టోబర్ 16న సినిమా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

Written By Vishnu Priya
Published: Sep 25, 2026, 10:01 PM IST | Updated: Sep 25, 2026, 10:13 PM IST
Join

Ranabali: ‘రణబలి’ వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చిత్రబృందం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. విజయ్ దేవరకొండకు వీరతిలకం పెడుతున్న పోస్టర్‌ను విడుదల చేసి, అనుకున్న తేదీకే సినిమా రాబోతుందని క్లారిటీ ఇచ్చింది.

విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రణబలి’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్‌, పాటలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ లుక్‌, యాక్షన్‌ సన్నివేశాలు, సినిమా నేపథ్యం ఆసక్తిని మరింత పెంచాయి.

ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత విజయ్‌, రష్మిక కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై కూడా అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ‘ఏందయ్య సామీ’ పాటకు కూడా మంచి స్పందన లభిస్తోంది.

అయితే గత కొంతకాలంగా ‘రణబలి’ విడుదల వాయిదా పడబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా అక్టోబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రాదనే ప్రచారం అభిమానుల్లో సందేహాలను కలిగించింది. దీంతో ఈ వార్తలపై చిత్రబృందం తాజాగా స్పందించింది.

విజయ్‌ దేవరకొండకు వీరతిలకం పెడుతున్నట్లుగా కనిపించే ప్రత్యేకమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అంతేకాదు, సినిమా అక్టోబర్ 16న చెప్పిన తేదీకే థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో సినిమా వాయిదా పడుతుందనే ప్రచారానికి తెరపడింది. ఈ ప్రకటనతో విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే వచ్చిన టీజర్‌ను పరిశీలిస్తే ‘రణబలి’లో యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, డ్రామా, పీరియాడిక్ నేపథ్యానికి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్‌లోని విజువల్స్‌, పాత్రల గెటప్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.

దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్ గత చిత్రాల్లోనూ కథా నేపథ్యం, విజువల్‌ ట్రీట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ కూడా విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్‌ ద్వారా అర్థమవుతోంది.

విడుదల తేదీపై క్లారిటీ రావడంతో ఇప్పుడు అభిమానుల చూపు ట్రైలర్‌, తదుపరి పాటలు, ఇతర ప్రమోషనల్‌ అప్‌డేట్స్‌పై పడింది. అక్టోబర్ 16న ‘రణబలి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Also Read: బుక్ మై షోలో నాని ‘ది ప్యారడైజ్’ మరో రికార్డు.. బడా స్టార్స్‌ను వెనక్కి నెట్టి..

Also Read: రామాయణ, రాకా చిత్రాలపై హాలీవుడ్ ఎఫెక్ట్.. ? ట్రోలింగ్‌తో మేకర్స్‌కు కొత్త టెన్షన్.. !!
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES