SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vishika In Paradise: 'ప్యారడైజ్‌'లో సంపూర్ణేష్ భార్య గుర్తుందా? రియల్ లైఫ్‌లో హీరోయిన్‌ మాదిరి సూపర్ మోడల్ లుక్!

Vishika In The Paradise: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ది ప్యారడైజ్' బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ కయాదు లోహార్, మెహన్ బాబు, సంపూర్ణేష్ బాబు వంటి నటీనటులతో పాటు సంపూర్ణేష్ భార్య పాత్రలో అప్‌కమింగ్ యాక్టరెస్ విషిక నటించింది. దేవి అనే పాత్రకు ఆమె నటనతో జీవం పోసిన విషిక రియల్ లైఫ్‌లో ఉండే తీరును చూసి ఎంతో మంది నెటిజన్లు షాక్ అయ్యారు. సినిమాలో డీగ్లామర్ రోల్ చేసిన ఈ బ్యూటీ..రియల్ లైఫ్‌లో హీరోయిన్ మాదిరి గ్లామర్‌తో కుర్రాళ్లను ఊపేస్తుంది.

Written By Harish Darla
Published: Sep 27, 2026, 02:24 PM IST | Updated: Sep 27, 2026, 02:28 PM IST
Join

Vishika In The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ది ప్యారడైజ్'. ఇటీవలే ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కథానాయకుడు నాని ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ప్రతి పాత్రకు తనదైన గుర్తింపును తెచ్చుకునేలా డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఇంతటి భారీ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబుతో పాటు హీరోయిన్ కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీరావు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించగా..వారి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా విడుదలై థియేటర్ల మిశ్రమ స్పందన లభించినా.. కలెక్షన్ల పరంగా సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్ల రూ.136 కోట్లకు పైగా కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది. అయితే ఈ సినిమాలో కీలక నటీనటులతో పాటు ఏ మాత్రం అంచనాలు లేని ఓ నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

మునుపటి సినిమాల్లో హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు.. 'ది ప్యారడైజ్' సినిమాలో ఆహార్యం దగ్గర నుంచి పాత్ర వరకు ఎంతో వైవిధ్యంగా సాగుతుంది. ఈ సినిమాలో 'బిర్యానీ' పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు కాస్త భిన్నంగా ప్రేక్షకులను అలరించగా.. తన భార్య దేవి పాత్రలో నటి విషిక కోటా నటించారు. సంపూర్ణేష్ బాబుతో పాటు అతని భార్య పాత్ర సినిమా ఆద్యంతం ఎంతగానో అలరించింది. దేవి పాత్రలో విషిక డీగ్లామర్ రోల్ పోషించినా.. సినిమాతో పోలిస్తే రియల్ లైఫ్‌లో ఆమె ఎంతో ఆకర్షణీయంగా ఉన్నారు.

నటి విషిక రియల్ లైఫ్‌లో ఎంతో స్టైలిష్‌గా అందంగా ఉండడం గమనించిన నెటిజన్లు విస్తుపోతున్నారు. సినిమాలో దేవి పాత్రకు రియల్‌ లైఫ్‌లో ఆమె ఫొటోలకు ఎలాంటి సంబంధం లేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ల మాదిరి సైజ్ జీరో మెయిన్‌టైన్ చేస్తూ, అందంలో స్టార్ హీరోయిన్లకు పోటీగా వెళ్లినా ఆశ్చర్యం అక్కర్లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'ది ప్యారడైజ్' సినిమాలో విషిక నిడివి పాత్ర తక్కువే అయినప్పటికీ, కథలోని కీలక సన్నివేశం ఆమె చుట్టూ తిరగడం వల్ల ఆమె నటన ఎంతో ప్లస్ అయ్యింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ధూమావతి దేవి విగ్రహం ముందు వచ్చే సన్నివేశంలో విషిక కనబరిచిన సహజమైన నటన ప్రేక్షకులను తీవ్రంగా కంటతడి పెట్టిస్తుంది. పెద్దగా హడావుడి లేకుండా తన పాత్ర పరిధి మేరకు సహజంగా నటించిన విషిక.. దేవి పాత్ర గుర్తుండిపోయేలా చేశారు.

విషిక కెరీర్..
నటి విషిక అసలు పేరు కీర్తి.. అయితే సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత విషిక అనే పేరుతో గుర్తింపు పొందింది. ఈమె సినీ ప్రయాణం ఎమోషనల్‌గా ప్రారంభమై, ఆ తర్వాత 'పాగల్ Vs కాదల్', 'కమిటీ కుర్రాళ్లు' వంటి చిత్రాలలో కొనసాగింది. 'కమిటీ కుర్రాళ్లు'లో పద్మ పాత్ర ద్వారా నటిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా 'కోర్ట్', 'పతంగ్', 'పురుషః' వంటి పలు సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ నటిగా తన పరిధిని పెంచుకుంటూ వెళ్తున్నారు విషిక.

Also Read: Peddi Vs The Paradise: మెగా ఫ్యామిలీపై ఎందుకంత ఏడుపు? 'పెద్ది' Vs 'ది ప్యారడైజ్'..టాలీవుడ్‌లో ద్వంద వైఖరికి పరాకాష్ట!

Also Read: Paradise Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో 'ది ప్యారడైజ్' సినిమా రగడ.. కాంగ్రెస్ Vs బీఆర్‌ఎస్ హంగామా!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES