)
Telangana Rains Live Updates: ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం
AP Rains Live Updates: మరో 1 లేదా 2 గంటల్లో బలహీనపడనున్న అర్నబ్ తుపాన్
తీవ్ర తుపాన్ నుంచి సాధారణ తుపాన్‌గా మార్పు
రాత్రికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం
అర్ధరాత్రిలోగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
రానున్న 48 గంటలు ఉత్తర వాయువ్య దిశగా తుపాన్ పయనం
తుపాన్ తీవ్రత తగ్గినా అప్రమత్తంగా ఉండాలి: అధికారులు
AP Rains Live Updates: రాగల మూడు గంటల్లో పలు జిల్లాలకు వర్ష సూచన..!
శ్రీకాకుళం, ఏలూరు, కోనసీమ, తూ.గో, ప.గో, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
గంటకు 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
AP Rains Live Updates: కాకినాడ జిల్లాలో యు.కొత్తపల్లి మండలంలో తుపాన్ నష్టం ఎక్కువగా జరిగిందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. కోనపాపపేట వద్ద 200 మీటర్లు, ఉప్పాడ కాకినాడ మధ్య మరో 200 మీటర్లు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందన్నారు. నీరు తగ్గిన వెంటనే రోడ్డు పనులు చేపడతామన్నారు. కోనపాప పేట వద్ద కరెంటు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని రేపటిలోగా కరెంటు ఇస్తామని తెలిపారు.
AP Rains Live Updates: అర్నబ్ తుపాన్ ప్రభావం ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. విజయవాడ కొన్ని ప్రాంతాలలో చెట్లు విరిగిపడిన వెంటనే తొలగించామన్నారు. విజయవాడలో ఎక్కడ ప్రాణ నష్టం కానీ.. ఆస్తి నష్టం కానీ జరగలేదన్నారు. కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.
AP Rains Live Updates: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇప్పటి వరకు అత్యధికంగా అనకాపల్లి జిల్లా కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. విజయనగరం జిల్లా భోగాపురంలో 26.2 సెం.మీ, వేపాడలో 23.6 సెం.మీ వర్షపాతం.. విశాఖపట్నంలో 26 సెం.మీ, పెందుర్తిలో 24.2 సెం.మీ, సింహాచలంలో 23.7 సెం.మీ.. అనకాపల్లి జిల్లా పరవాడలో 24.7 సెం.మీ, యలమంచిలిలో 24 సెం.మీ, అచ్యుతాపురంలో 23.9 సెం.మీ వర్షపాతం
AP Rains Live Updates: తుపాన్ బీభత్సం సమయంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో ఓ షిప్ ప్రత్యక్షమైంది. కొన్ని గంటల తర్వాత కనిపించకుండా వెళ్లిపోయింది. ఇవాళ ఉదయం అంతర్వేది బీచ్‌లోని లైట్ హౌస్‌కు కిలోమీటర్ దూరం వరకు షిప్ రావడం స్థానిక మత్స్యకారులకు కంటపడింది. సముద్రంలో పెనుగాలికి ఓడ కొట్టుకు వచ్చినట్లుగా భావించారు. అయితే షిప్ ఎక్కడి నుంచి వచ్చింది..? ఎటు వెళుతుంది వివరాలు తెలియలేదు..? మధ్యాహ్నం తర్వాత అంతర్వేది తీరంలో షిప్ కనిపించలేదని మెరైన్ సీఐ నవీన్ తెలిపారు.
AP Rains Live Updates: గంటకు 120 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు..
అనకాపల్లి జిల్లా నుంచి బాపట్ల జిల్లా వరకు రెడ్ అలర్ట్ జారీ..
వచ్చే ఆరు-ఏడు గంటలు కీలకం..
8 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం..
ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..
సాయంత్రం వరకు భారీ వర్షాలు పడే సూచన..
భీకర గాలులకు ఎక్కడికక్కడ తెగిపడిన విద్యుత్ వైర్లు..
మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు..
విశాఖలో జలమయమైన అనేక ప్రాంతాలు
AP Rains Live Updates: అర్నబ్ తుపాన్ ప్రభావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP Rains Live Updates: అర్నబ్ తుపాన్ శ్రీకాకుళం జిల్లాలో అల్లకల్లోలం సృష్టించింది. తీర ప్రాంతాల్లో అలజడి రేపడంతో పాటు ఈదురు గాలులు భీభత్సం ఉద్దానం ప్రాంతీయుల్ని వణికించింది. తుఫాన్ తీరం దాటిన సమయంలో ఒక్కసారిగా గాలులు విరుచుకుపడ్డాయి. ఇచ్చాపురం, కవిటి, వజ్రపుకొత్తూరు, మందస, పోలాకి, గార మండలాల్లో చెట్లు నేలకొరిగాయి. బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తుపాన్ ప్రభావంతో ఇచ్చాపురం వద్ద బహుదా నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఒడిశాలోని భగలట్టి డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో బహుదా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరద తీవ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వందలాది ఎకరాల్లో వరి పంట నేలమట్టం అయిందని, కొబ్బరి తోటలు ధ్వంసం అయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
AP Rains Live Updates: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటన.
ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి అనిత.
ఎస్.రాయవరం మండలం చిన్నగుమ్ములూరు గ్రామంలో ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న హోంమంత్రి.
పునరావాస కేంద్రంలో అందుతున్న వసతులపై ప్రజలను ఆరా తీసిన మంత్రి అనిత.
పునరావాస కేంద్రంలో అధికారులు అందుబాటులో ఉంటున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్న మంత్రి.
అధికారులు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని తెలిపిన గ్రామస్తులు.
పునరావాస కేంద్రంలో అందుతున్న సేవలు, వసతులపై సంతృప్తి వ్యక్తం చేసిన గ్రామస్తులు.
AP Rains Live Updates: అర్నబ్ తుఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీభత్సం సృష్టించింది. అరటి రైతుల కష్టంపై ప్రకృతి పగబట్టినట్లుగా విరుచుకుపడింది. ఆత్రేయపురం, రావులపాలెం ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అరటి చెట్లు నిలువునా నేలకొరిగాయి. ఎకరానికి సుమారు రెండు లక్షల వరకూ పెట్టుబడి పెట్టిన రైతులు పూర్తిగా కుదేలయ్యారు.
AP Rains Live Updates: అర్నబ్ తుపాన్ ప్రభావం ఉన్న మునిసిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారాయణ
తుపాన్ ప్రభావంతో పట్టణాల్లో జన జీవనానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి
రోడ్లపై చెట్లు కూలిన చోట వెంటనే తొలగించేలా తగిన యంత్రాలతో సిబ్బంది అలెర్ట్ గా ఉండాలి
ఈదురు గాలులతో ప్రమాదకర హోర్డింగ్ ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి
రోడ్లుపై ,డ్రెయిన్ లలో నీరు నిలువకుండా ఇంజినీరింగ్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టాలి
వర్షం కారణంగా పారిశుధ్య సమస్యలు, నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
AP Rains Live Updates:
AP Rains Live Updates: పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంత మండలాలైన నరసాపురం, మొగల్తూరులో అర్నాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భీకర ఈదురుగాలుల ధాటికి ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి.. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.. కొబ్బరి, తాటి చెట్లు సైతం నేలమట్టమయ్యాయి. గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు సమాచారం. తుఫాన్ దెబ్బకు పలు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. తీర ప్రాంతంపై తుఫాన్ విరుచుకుపడటంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది.
భీకర గాలుల ధాటికి భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు కూలిపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్ల పైకప్పులు దెబ్బతినడంతో బాధితులు తలదాచుకునేందుకు ఆశ్రయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుతాళ్లు, సీతారాంపురం, మర్రితిప్పతో పాటు పలు గ్రామాల్లో రహదారులపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రొక్లైనర్ల సాయంతో చెట్లను తొలగిస్తూ రహదారులను పునరుద్ధరిస్తున్నాయి.
మరోవైపు తుఫాన్ బాధితులను నరసాపురం పట్టణంలోని మిషన్ హైస్కూల్ తో పాటు నియోజవర్గంలో 24సా పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసి, నిరాశ్రయులైన కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.
Cyclone Arnab Live Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ తీరం దాటింది. యానాం-నర్సాపురం మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కోస్తాంధ్రతో పాటు పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచే భీకర గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అటు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని విశాఖ, మన్యం, అల్లూరి జిల్లాల్లో నదులు, జలపాతాలు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలగా, అల్లూరిలో వరద తీవ్రతకు కల్వర్టు కొట్టుకుపోయింది. అర్నాబ్ తుఫాన్ కదలికలు, వర్ష తీవ్రత, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ మీకోసం..