Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఘోరం.. ఆలయంలో దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..
Truck accident in Madhya Pradesh: ఛినోర్ వైపు నుంచి అధిక లోడ్ తో వెళ్తున్న ట్రక్ స్పీడ్ తో ఒక్కాసారిగా అదుపుతప్పి శీతల మాత ఆలయంలోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతనో స్పాట్ లోనే 12 మంది విగత జీవుల్లా మారిపోయారని చెబుతున్నారు. 30 మంది వరకు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
12 dead several injured after truck accident in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లోని గ్బాలీయర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చినోర్ నుంచి ట్రక్ భారీలోడ్ తో వచ్చి అదుపుతప్పింది. ఆ తర్వాత పక్కనే ఉన్న శీతల మాత ఆలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రక్ కింద పడి 12 మంది భక్తులు దుర్మరణం చెందారు. మరో 30 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.భారీ ట్రక్ లకు ఆ ప్రదేశంలో నిషేదం ఉన్న కూడా రావడంతో అది కాస్త అదుపుతప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
వెంటనే పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తెల్లవారుజామున సుమారు 1:30 గంటలకు ఈ ఘటన జరిగింది. అమ్మవారి ఆలయం సమీపంలో భక్తులు ట్రక్ కింద పడి నలిగిపోయి విగత జీవుల్లామారిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ఘటన స్థలంలోనే 12 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
మరో 30 గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. వీరిలో కొంత మంది తీవ్రమైన గాయాలతో పాటు, ఎముకలు కూడా విరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటనపై అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.