SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎయిర్‌టెల్ రూ.399 రీఛార్జ్‌పై 1+1 ఫ్రీ ఆఫర్.. ఏకంగా 56 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటా!

మీరు ఎప్పటికప్పుడు రీఛార్జీ చేసుకున్నా డేటా సమస్య వేధిస్తోందా? అయితే, ఎయిర్‌టెల్ యూజర్‌లకు రూ.399 ప్లాన్‌ బెస్ట్‌. ఇందులో మీరు అపరిమిత 4జీ, 5జీ డేటా వ్యాలిడిటీ 28 రోజులపాటు పొందుతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 12, 2026, 02:20 PM IST | Updated: Nov 12, 2026, 02:23 PM IST
Image Credit: Airtel Rs 399 Recharge Plan:
Join

Airtel Rs 399 Recharge Plan: మీరు ఎయిర్‌టెల్‌ యూజర్స్‌ అయితే, మీకు ఇంటర్నెట్‌ డేటాతో సమస్య అయితే వెంటనే ఈ రూ.399 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకోండి. ఇందులో 1+1 రీఛార్జీ ఆఫర్‌తోపాటు ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం కూడా ఉచితంగా పొందుతారు. ఒక వేళ మీకు 4జీ, 5జీ అందుబాటులో ఉన్న అపరిమిత డేటా, కాలింగ్‌ బెనిఫిట్స్‌ పొందుతారు. దీంతో పాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం. ఈ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులపాటు వర్తిస్తుంది. ఎయిర్‌టెల్‌ రూ.399 ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే ఎస్టీడీ కాలింగ్‌, అపరిమిత లోకల్‌ వాయిస్‌ కాలింగ్‌ కూడా ఏ నెట్‌వర్క్‌ అయినా అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ వంద ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఉన్న యూజర్స్‌ 5జీ డేటా పొందుతారు.

1+1 రీఛార్జీ ఉచిత ఆఫర్..
ఎయిర్‌టెల్‌ 1+1 రీఛార్జీ ఉచిత ఆఫర్‌ కూడా దీనికి వర్తిస్తుంది. అంటే రూ.399 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే అదనంగా మరోనెల ఉచితంగా పొందుతారు. ఇది యూజర్స్‌కు బడ్జెట్‌ ఫ్రెండ్లీలోనే లభిస్తుంది. అదనంగా మరో 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్యాక్‌ ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లో అందుబాటులో ఉంది.

Read Also: నెలవారీ రీఛార్జ్ గోల లేదు.. 365 రోజులకు కేవలం రూ.2399 మాత్రమే! BSNL బంపర్ ప్లాన్ వివరాలివే!

Read Also: అవాక్కయ్యే ఆఫర్ ఇచ్చిన ఎయిర్‌టెల్.. రూ. 349 ప్లాన్‌పై 1+1 ఉచిత ఆఫర్.. రోజూ 2GB డేటా, అపరిమిత 5G!
 

ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం..
ఈ ప్లాన్‌లో మీరు 12 నెలలపాటు ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం యాక్సెస్‌ కూడా పొందుతారు. దీని విలువ రూ.4000 ఉంటుంది. దీంతో మీకు కావాల్సిన సోషల్‌ మీడియా పోస్టులు క్రియేట్‌ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ థంబనైల్, బ్యానర్స్‌, పోస్టర్స్‌ ఇతర క్రియటివ్‌ డిజైన్స్‌ ఈ ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం ప్యాక్‌ ద్వారా పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ ఉచిత హలో ట్యూన్స్‌..
ఎయిర్‌టెల్‌ ప్లాన్‌లో మీరు ఎయిర్‌టెల్‌ సేఫ్‌ ఫీచర్‌ కూడా పొందుతారు. ఇది డిజిటల్‌ సెక్యూరిటీ ప్లాన్‌ అని కూడా చెప్పొచ్చు. ఎయిర్‌టెల్‌ యూజర్స్‌ ఇందులో రియల్‌ టైమ్‌ స్పామ్‌ కాల్‌ అలెర్ట్స్‌, ప్రాడ్‌ బ్లాక, ఓటీపీ బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ అలెర్ట్‌ కూడా పొందుతారు. ఇందులో ఉచిత హలో ట్యూన్‌ కూడా పొందుతారు. నెలరోజులపాటు ఇది ఉచితంగా యాక్సెస్‌ చేయవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES