SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎయిర్‌టెల్ కస్టమర్లకు పండగే..! రూ.598 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ ఉచితం.. డైలీ 2జీబీ డేటా!

Airtel Rs 598 recharge plan: ఎయిర్‌టెల్‌ యూజర్‌లకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. మీరు ఎక్కువగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తారా? అయితే, ఎక్కువగా డేటా వాడతారా? మీకు ఎయిర్‌టెల్‌ రూ.598 ప్లాన్‌ బెస్ట్‌.. ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ప్రతిరోజూ 2 జీబీ డేటా కూడా పొందుతారు. దీంతో మీరు నిరంరాయంగా మీకు కావాల్సిన సినిమాలు వీక్షించవచ్చు. ఈ ప్లాన్‌కు సంబంధించిన ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 27, 2026, 11:07 AM IST | Updated: Oct 27, 2026, 11:11 AM IST
Image Credit: Airtel 598 Plan Details
Join

Airtel Rs 598 recharge plan: ఎయిర్‌టెల్‌ యూజర్‌లకు ఇప్పటికే విభిన్న రీఛార్జీ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ఎయిర్‌టెల్ ఇటీవలె వాయిస్‌ ఓన్లీ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఎయిర్‌ టెల్‌ రూ.598 ప్లాన్‌ బంపర్‌ బెనిఫిట్స్‌ అందిస్తోంది. ప్రతి రోజూ 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యం కూడా లభిస్తుంది. దీంతోపాటు నెట్‌ఫ్లికస్‌ బేసిక్‌, జియోహాట్‌స్టార్‌ సూపర్, జీ5 ప్రీమియం, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే 5జీ డేటా, ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్‌ రూ.598 ప్లాన్‌..
ఎయిర్‌టెల్‌ రూ.598 ప్లాన్‌ వ్యాలిడిటీ కేవలం 28 రోజులపాటు మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2 జీబీ డేటా, అంటే మొత్తం 56 జీబీ డేటా పొందుతారు. దీంతోపాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఎస్‌టీడీ, రోమింగ్‌ కాల్స్‌తోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌..
ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే కాలింగ్‌, నెట్‌ సౌకర్యంతోపాటు అదనంగా మీరు ఓటీటీలు కొనుగోలు చేయాల్సిన పనిలేదు.. 28 రోజులపాటు కూడా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రీప్షన్‌ లభిస్తుంది. దీంతో మీరు సినిమా, వెబ్‌సిరీస్‌, ఒరిజినల్‌ షోలు కూడా వీక్షించవచ్చు.  ఈ ప్లాన్‌తో మీరు రీఛార్జ్‌ చేసుకునే ముందు ఆఫర్స్‌ చూసి  కొనుగోలు చేయండి.

Read Also: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.379 కే రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G.. ఉచితంగా యాపిల్‌ మ్యూజిక్‌!

Read Also:  ఎయిర్‌టెల్‌ ధమాకా ప్లాన్.. 56 రోజుల వాలిడిటీ, రోజుకు 3GB డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం!
 

జియో హాట్‌స్టార్‌ సూపర్‌, జీ5 ప్రీమియం..
ఎయిర్‌టెల్‌ రూ.598 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌తోపాటు ఒక నెలపాటు జియో హాట్‌స్టార్‌ సబ్‌స్క్రీప్షన్‌ పొందుతారు. ఇందులో కూడా సినిమాలు, సీరియల్స్‌ ,వెబ్‌సిరీస్‌
అందుబాటులో ఉంటుంది. 28 రోజులపాటు జీ5 ప్రీమియం కూడా లభిస్తుంది. వేర్వేరుగా రీఛార్జీ చేయాల్సిన పనిలేదు, సింగిల్‌ ప్లాన్‌తో ఈ బెనిఫిట్స్‌ అన్నీ పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం..
ఎయిర్‌టెల్‌ రూ.598 ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ ప్రీమియం యాక్సెస్‌ కూడా లభిస్తుంది. ఇందులో కూడా మీరు ఓటీటీ కంటెంట్‌ లభిస్తుంది. అంటే ఒక్క రీఛార్జీ ప్లాన్‌తో మీరు ఇన్ని ఓటీటీలు కూడా పొందుతారు.దీంతోపాటు ఈ ప్లాన్‌లో మీరు అదనంగా 12 నెలలపాటు ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం రూ.4000 విలువ ఉండే ప్లాన్‌ కూడా ఉచితంగా పొందుతారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES