• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రైల్వేలో 2,800కి పైగా అప్రెంటిస్ పోస్టులు, పరీక్ష లేకుండానే ఎంపిక..!!

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రైల్వేలో 2,800కి పైగా అప్రెంటిస్ పోస్టులు, పరీక్ష లేకుండానే ఎంపిక..!!

Central Railway: సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఐటీఐ అర్హతతో భారీ సంఖ్యలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Written ByBhoomi
Published: Nov 20, 2026, 11:34 IST|Updated: Nov 20, 2026, 11:36 IST
joinshare
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రైల్వేలో 2,800కి పైగా అప్రెంటిస్ పోస్టులు, పరీక్ష లేకుండానే ఎంపిక..!!
Image Credit: Central Railway Recruitment 2024:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Central Railway: సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఐటీఐ అర్హతతో భారీ సంఖ్యలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్  చేసింది. రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ ముంబై ఆధ్వర్యంలో మొత్తం 2,861 ఖాళీలను భర్తీ చేయనుంది. వ్రాత పరీక్ష లేకుండానే  కేవలం మెరిట్ ఆధారంగానే అభ్యర్ధులను ఎంపిక చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ముంబై, భుసావల్, పుణె, నాగ్ పూర్, షోలాపూర్ క్లస్టర్ల పరిధిలోని వర్క్ షాపుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వంటి పలు ట్రేడుల్లో అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు. అత్యధికంగా ముంబై క్లస్టర్ లో 1712 పోస్టులున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో టెన్త్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. 2026 నవంబర్ 3నాటికి అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమిలో సడలింపు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్2, 2026లోపు దరఖాస్తు  చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 100ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాంపు ఇచ్చారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి వ్రాత పరీక్ష ఉండదు. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్టును రూపొందించి.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ చేస్తారు. సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఏడాది పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ. 9,600 చొప్పున స్టైఫండ్ అందిస్తారు.

Also Read: 

 

 

సొంత ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 'పిచ్చికుక్కలు కరిచాయా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు!

 

 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs
Govt Jobs
Indian Railways