SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CEC Gyanesh Kumar: సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు.. సుప్రీంలో విచారణ, రాజీనామా చేయాల్సిందేనా?

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై, ఆయనను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. రాకేష్ కుమార్ సింగ్ తరపున అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్లను సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. విచారణ పూర్తయ్యే వరకు సీఈసీ కీలక నిర్ణయాలు తీసుకోకూడదని, ఇతర ఈసీల ఆమోదంతోనే కార్యకలాపాలు నిర్వహించాలని పిటిషనర్లు కోరుతున్నారు.

Written By Renuka Godugu
Published: Oct 05, 2026, 09:34 AM IST | Updated: Oct 05, 2026, 09:40 AM IST
Image Credit: CEC Gyanesh Kumar
Join

CEC Gyanesh Kumar: 10 నెలల కాలంలో ఎస్ఐఆర్ విషయంలో జ్ఞానేష్ కుమార్ 14 నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఈసీ వివరణలు ఇస్తున్నప్పటికీ, విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ జనాతా పార్టీ సీఈసీ తీరును విమర్శిస్తూ, ఆయన రాజీనామా చేయాలని ముంబైలో భారీ ఆందోళనలు చేస్తోంది. అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా విపక్షాలు, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ వివాదాస్పద ఎస్ఐఆర్ నిర్ణయాల నేపథ్యంలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య ,జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. పిటిషనర్లు ఆ 14 ఎస్ఐఆర్ నిర్ణయాలను రద్దు చేయాలని, జ్ఞానేష్ కుమార్ పై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒకవేళ జ్ఞానేష్ కుమార్ తప్పు చేసినట్లు తేలితే, ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అదే కోర్టు సీఈసీకి అనుకూలంగా వస్తే విపక్షాల స్పందన ఎలా ఉంటుంది చూడాలి.

ప్రతిపక్షాల ఆరోపణలు.. ఈసీపై పారదర్శకత డిమాండ్..
ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచీ ఈసీ నిర్ణయాల వల్ల అనేక రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని ఆరోపిస్తున్నాయి. ఎన్నికల వల్ల ప్రభుత్వాలు మారినప్పటికీ, ఈసీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో మార్పులు చేసినప్పుడు పూర్తి డేటాను బహిర్గతం చేయాలని, ఓట్లు తొలగించిన వారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని, రాజకీయ పార్టీలకు సకాలంలో డేటాను అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, లోపాలు ఉన్నచోట స్వతంత్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.

సీఈసీపై కాంగ్రెస్ ఆరోపణలు..
మరోవైపు, ఎన్నికల కమిషనర్లు సీఈసీ తీరును తప్పుబడుతూ, ఆయన అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలాంటి ప్రవర్తనతో ఆయన పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, ఓట్ల తొలగింపు వల్ల ఓటర్లు నష్టపోయారని కాంగ్రెస్ వాదిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అధికారుల నిర్ణయాల వల్ల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కాలరాయకూడదని కాంగ్రెస్ పార్టీ ప్రజలను చైతన్యపరచాలని భావిస్తోంది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి మిగిలిన పార్టీలను ఏకం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, బీజేపీ నుంచి మాత్రం ఈ ఆరోపణలపై స్పందన లేదు. ఎన్నికల్లో ఓడిపోతున్న ప్రతిసారీ ఓటింగ్, ఈవీఎంల మీద తప్పులు చెబుతూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ పరోక్షంగా అభిప్రాయపడుతోంది.

ఈసీ తీరుపై ప్రతిపక్షాల ఆందోళన..
ఇక ఇప్పుడు ఓట్లు తొలగించారని ఆ కారణంగానే తాము గెలవలేకపోయామంటూ బీజేపీ మండిపడుతోంది. ముఖ్యంగా ఈ ఆరోపణలు చేస్తూనే, కాంగ్రెస్ పార్టీ ఓటర్ల ప్యూరిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలని డిమాండ్ చేస్తోంది. గతంలో ఓటర్ల జాబితా పూర్తి చేసేందుకు జరిగిన ప్రక్రియను ఇప్పుడు కొత్తగా చేపట్టడం లేదని బీజేపీ వాదిస్తుంటే, ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈసారి బాధ్యతగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఒక టైమ్ ఫ్రేమ్ పేరుతో ప్రోగ్రామ్‌ను ప్రకటించగా, మిగిలిన పార్టీలు కూడా ఒక్కొక్కటిగా ఆందోళనలో భాగస్వాములవుతున్నాయి.

Read Also: సామాన్యుడికి కోలుకోలేని దెబ్బ.. ఒక్కసారిగా రూ. 83కి చేరిన సన్న బియ్యం ధరలు! ఉన్నట్టుండి ఎందుకు పెరిగాయంటే..?
Read Also: మందు బాబులకు షాక్.. రేపటి నుంచి తెలంగాణలో లిక్కర్ షాప్స్ బంద్..?

ఫార్మ్-7 వివరాలు ఇవ్వాలని ఎంఐఎం డిమాండ్..
ముంబైలో ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుండగా, ఢిల్లీలో కూడా ఇదే ఆందోళన కొనసాగుతోంది. రానున్న రోజుల్లో దీనిని ఒక పెద్ద ఉద్యమంగా మార్చడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఎంఐఎం పార్టీకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందిస్తూ, ఫార్మ్-7 ద్వారా ముస్లింల ఓట్లనే తొలగిస్తున్నారని మండిపడ్డారు. ప్రింటెడ్ ఫార్మ్-7లు ఎలా ఇస్తున్నారు, వాటిని సమర్పించిన వారి వివరాలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. తొలగించిన ఓట్ల విషయంలో ఎవరు ఫార్మ్-7 సబ్మిట్ చేశారనే వివరాలు ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే రానున్న రోజుల్లో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని కూడా హెచ్చరించింది. మొత్తంగా చూస్తే, ప్రతిపక్షాలన్నీ ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES