• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్.. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏంచెప్పిందంటే..?

Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్.. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏంచెప్పిందంటే..?

SC On Internet access for children: పిల్లలకు రక్షణ పేరుతో వారిని నెట్ కు దూరం చేయడం సబబు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.అంతే కాకుండా ఆన్ లైన్ లో అశ్లీలత వీడియోలను, లైంగిక వేధింపుల అంశాలపై సీరియస్ గా చర్యలు తీసుకొవాలని ఆదేశించింది.

Written ByInamdar Paresh
Published: Oct 17, 2026, 01:25 PM IST|Updated: Oct 17, 2026, 01:39 PM IST
joinshare
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్.. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏంచెప్పిందంటే..?
Image Credit: supremecourt(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Rajasthan:  ఒకే అమ్మాయి కోసం ఇద్దరు మైనర్ల ఫైటింగ్.. రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్ లో  కలకలం.. వీడియో..

Rajasthan: ఒకే అమ్మాయి కోసం ఇద్దరు మైనర్ల ఫైటింగ్.. రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్ లో కలకలం.. వీడియో..

2

బెండకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏం చెబుతున్నారు?

3

పరగడుపున నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ప్రకారం ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు!

4

బ్యూటీ పార్లర్ పెట్టిన కోతులు.. ఒకదానికి మరొకటి మేకప్.. వీడియో!

5

బెంగాల్‌లో నవరాత్రుల్లో అమ్మవారికి చేపల కూర నైవేద్యం.. అసలు కథ ఇదేనా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Supreme court on internet usage for children: ఇటీవల స్మార్ట్ ఫోన్ లో వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చేతిలో ఉండే చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లే. ఎక్కడ ఎలాంటి మార్పులు, ఘటనలు జరిగిన వివిధ మాధ్యమాల ద్వారా సెకన్లతో తెలుసుకొవచ్చు. మొబైల్ నెట్ వర్క్ లు సైతం తక్కువ ధరకే ఇంటర్నేట్ సదుపాయాలను కల్పిచడంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు తమ అరచేతిలో ప్రపంచంలో ఏంజరుగుతుందో ఇట్టే తెలుసుకుంటున్నారు. అయితే.. కొన్ని సార్లు ఇంటర్నేట్ వాడకం అనేది చెడు మార్గంలో వెళ్తుందని ఫిర్యాదులు కూడా తరచుగా వస్తున్నాయి. ఆన్ లైన్ లో మోసాలు, అశ్లీల వెబ్ సైట్ ల బారిన కొంత మంది పడుతున్నారు. 

కొంత మంది చిన్నారులు ఇలాంటి వాటి బారిన పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న పిల్లలు ఇంటర్నేట్ వాడకంపై సుప్రీంకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపై  జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంటర్నేట్ అనేది రాజ్యంగం కల్పించిన ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 19(1)(a) కింద ప్రాథమిక హక్కుగా అభివర్ణించింది. పిల్లలకు భద్రత పేరుతో నెట్ కు దూరంచేయడం సరికాదని స్పష్టం చేసింది.


ఇంటర్నెట్‌ తో ప్రపంచంలో ఏంజరుగుతున్న, ఎలాంటి సమాచారం అయిన మారుమూల ప్రాంతాల్లో ఉండి తెలుసుకొవచ్చాన్నారు. చదువు, విద్య, ఉద్యోగం, ఇతర సమాచారాల మార్పిడికి ఇంటర్నేట్ ఎంతో ఉపయోగపడుతుందని తెల్చి చెప్పింది. పిల్లల రక్షణతో పాటు వారి స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. అయితే ఇటీవల కొన్ని ఘటనల నేపథ్యంలో.. పిల్లలను నెట్ కు పూర్తిగా దూరం చేయడం సరికాదని చెప్పుకొచ్చింది. 

ఒకవేళ ఇంట్లోని పెద్దలు పిల్లలకే నెట్ వాడటంపై నిషేధం విధిస్తే..  పిల్లలు ఇంట్లో వారికి చెప్పకుండా నెట్ ను ఉపయోగించే ప్రమాదం ఉందని, అలాంటి తరుణంలో చేయిదాటిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 

పిల్లలకు ఇంటర్నేట్  యాక్సెస్ ఇస్తునే వారికి అర్థమయ్యేలా మార్గనిర్దేషం చేయాలని, వారిని  ఒక కంట కనిపెట్టి ఉండాలని సూచించింది. పిల్లలకు అవసరంలేని వాటిని ముందుగానే గుర్తించి ప్రైవేట్ లో పెట్టడంలాంటి పనులు చేయడం వంటివి చేయోచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపైన కేంద్రం ఇంకా అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకొవాల్సిన అవసరం  ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Supreme Court
National News
Telugu News