CM Revanth reddy: దేశ రాజకీయల్లో కీలక పరిణామం.. ప్రధాని మోదీతో భేటి అయిన సీఎం రేవంత్.. అసలు విషయం ఏమిటంటే..?
cm revanth reddy meets with pm modi: ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు మంత్రులు భేటీ అయ్యారు. ముఖ్యంగా తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్ తో పాటు ఎల్ నినోపై తక్షణం కేంద్రం సాయం చేయాలని కోరుతూ భేటీ అయ్యారు.
CM Revanth reddy meets with pm modi: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎల్ నినో ప్రభావంపై వెంటనే రూ. 30 వేలకోట్ల కరువు సాయం ప్రకటించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో ప్రధాని మోదీతో భేటీ అయి విజ్ఞప్తి పత్రం అందజేశారు. గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై కీలక విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహెట్టి నిర్మాణానికి సీఎం రేవంత్, కేంద్రం సహకారం కోరారు.
అదే విధంగా.. సమ్మక్క-సాగర్ ప్రాజెక్టుకు అనుమతులపై చర్చజరిపారు. ప్రాజెక్టు జలాల్లో 50 శాతం వాటాను సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో చర్చలో భాగంగా కోరారు. దీనితో పాటు ప్రధానమంత్రి మోదీని డిసెంబర్ లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా గేమ్స్ కు ముఖ్య అతిథిగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ గా ఆహ్వానించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా గేమ్స్ లోని పలు అంశాలపై ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి కూడా ఉన్నారు.
ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సర్ ప్రక్రియపై కేంద్రపై తీవ్ర విమర్శలు చేస్తుంది. మరోవైపు ఇటీవల ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటించారు. హైదరాబాద్ లోని ఏఐసీసీలో భారత్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించారు. దీనిలో సైతం.. కేంద్రంపై విరుచుకు పడ్డారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కావడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.