పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడు మరణిస్తే.. ఆ కుటుంబం డబ్బులు ఎలా పొందాలి? సింపుల్ స్టెప్స్!
మీ కుటుంబంలో ఎవరికైనా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉందా? ఒకవేళ ఇండియా పోస్ట్ ఖాతాదారుడు మరణిస్తే అతడి ఖాతా నుంచి డబ్బులు ఎలా క్లెయిమ్ చేయాలి? ఆ స్టెప్ బై స్టెప్ ప్రక్రియ ఏంటి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Deceased Persons Post Office Account: పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపునకు ఎంతో ఉపయోగకరమైంది. ఎక్కువ డబ్బులతో ఖాతా అవసరం ఉండదు. మీరు ఎంత డబ్బు పొదుపు చేస్తారు అనేది నిర్ణయించుకుని డబ్బులు దాచుకోవచ్చు. అయితే, చాలా మంది కుటుంబాల్లో పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న అద్భుతమైన పథకం.. ఒకేసారి బల్క్‌గా మాత్రమే కాదు మీరు నెలవారీగా కూడా మీరు ఆర్డీ కూడా చేసుకోవచ్చు. అయితే, ఏదైన అనుకోని సంఘటనలు జరిగితే పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడు మరణిస్తే కుటుంబసభ్యులు ఆ డబ్బులను ఎలా క్లెయిమ్ చేయాలి? చాలా మందికి ఇలా ఇంటి పెద్ద లేదా బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉన్నవారు మరణిస్తే ఇబ్బందిగా మారుతుంది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఇండియా పోస్ట్ ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, సేవింగ్స్ ఖాతాదారులకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చున ఇంటి నుంచే సబ్మిట్ చేసే వెసులుబాటు కూడా ఉంది. అయితే, చనిపోయిన వ్యక్తి, వారసులకు సంబంధిత డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ పేరు Deceased Claim Portal అని పిలుస్తారు.
అయితే, ఇది పోస్ట్ ఆఫీస్‌తోపాటు పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సేవింగ్స్ ఖాతాదారులకు కూడా వర్తిస్తుంది. ఈ పని ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. మీరు ఇంటి నుంచే ఈ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మీ వద్ద సంబంధిత ధ్రువపత్రాలు ఉంటే చాలు.
ఇండియా పోస్ట్ డిసీస్డ్ క్లెయిమ్ పోర్టల్ అంటే?
ఈ చినిపోయిన ఖాతాదారుల క్లెయిమ్ పోర్టల్ సులభంగా అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు పెట్టుకోవచ్చుముందుగా ఈ అధికారిక పోర్టల్ ఓపెన్ చేసి చదవండి. మీరు పోస్ట్ ఆఫీస్ వెళ్లకుండానే కేవలం ఫోన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. అయితే, ఎలా దరఖాస్తు చేయాలనే గైడెన్స్ కూడా మీరు అక్కడ పొందవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లతో సింపుల్‌గా మొబైల్‌లోనే దరఖాస్తు చేయవచ్చు. ఆ తర్వాత క్లెయిమ్ ఆమోదం అయితే, మీ మొబైల్‌కే మెసేజ్ కూడా వస్తుంది. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పోర్టల్ యాక్సెస్ చేయవచ్చు.
కావాల్సిన డాక్యుమెంట్స్..
పోస్ట్ ఆఫీస్‌లో చనిపోయినవారి ఖాతా డబ్బులు క్లెయిమ్ చేయాలంటే మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, సేవింగ్స్ సర్టిఫికేట్ లేదా పాస్‌బుక్ కలిగి ఉండాలి. అంతేకాదు కుటుంబ సభ్యులకు లీగల్‌గా వారసులు అని నిరూపించే పత్రాలు కూడా కావాలి. నామినీ ఉంటే వారికే ఈ డబ్బులు చెందుతాయి. దీనికి కూడా సంబంధిత డాక్యుమెంట్స్, సంతకం వంటివి కూడా అవసరం.
ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేసే విధానం..
మీరు కూడా పోస్ట్ ఆఫీస్ డిసీజ్డ్ ఖాతా క్లెయిమ్ చేయాలనుకుంటున్నారా? ఇండియా పోస్ట్ పోర్టల్ ద్వారానే ఈ పని పూర్తి చేయవచ్చు. దీనికి ఇండియా పోస్ట్ అధికారిక పోర్టల్ indiapost.gov.in ఓపెన్ చేయాలి. అక్కడ Deceased claim portal ఎంపిక చేయండి. అక్కడ కావాల్సిన వివరాలు నమోదు చేయాలి. డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్స్‌ను పోస్ట్ ఆఫీస్ అధికారులు వెరిఫై చేస్తారు. మీకు ఇతర వివరాలు లేదా సందేహాలు ఏమైనా ఉంటే వెంటనే 1800 266 6868 హెల్ప్ లైన్ నెంబర్‌కు కాంటాక్ట్ అవ్వచ్చు.