SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆయుష్మాన్ కార్డుదారులకు అలర్ట్.. మీ ఉచిత రూ.5 లక్షల క్లెయిమ్ తిరస్కరిస్తే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం జన్‌ ఆరోగ్య యోజన కార్డు మీకూ ఉందా? అయితే, రూ.5 లక్షల క్లెయిమ్‌ పొందడంలో సమస్యలు వస్తున్నాయా? మరి ఎక్కడ ఫిర్యాదు చేయాలి? నిరుపేదలకు వరంగా ఉన్న ఈ ఆయుష్మాన్‌ కార్డుతో నిర్ధిష్ట ఆసుపత్రిలో మెడికల్‌ చికిత్స పొందడంలో ఇబ్బందులు ఎదురైతే ఎలా ఫిర్యాదు చేయాలి? తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 28, 2026, 10:31 AM IST | Updated: Oct 28, 2026, 10:34 AM IST
Image Credit: Ayushman Card Complaint:
Join

Ayushman Card Complaint: ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు.. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఎన్నో పథకాల్లో ఈ పీఎం జన్‌ ఆరోగ్య యోజన కూడా నిరుపేదలకు వరంగా మారింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.5 లక్షల వరకు నిర్ధిష్ట ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు.  అర్హులైన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రజా ఆరోగ్యమే లక్ష్యం పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. అయితే, ఒక్కోసారి అర్హులైనా కానీ, ఈ ఆయుష్మాన్‌ కార్డు ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. క్లెయిమ్‌ సెట్టిల్‌, ఆసుపత్రుల్లో అడ్మిషన్‌లో సమస్యలు ఎదురుకావచ్చు. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఒక ఫిర్యాదు చేస్తే చాలు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఒక టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ మీరు కంప్లయింట్‌ చేస్తే చాలు.

ఫిర్యాదు చేసే విధానం..
మీరు కూడా ఈ ఆయుష్మాన్‌ స్కీమ్ సంబంధించి ఫిర్యాదు చేయాలంటే ఆయుఫ్మాన్‌ భారత్‌ స్కీమ్‌ 14555 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయవచ్చు. ఇక్కడ మీరు కావాల్సిన వివరాలు కూడా పొందుతారు. ఇది కాకుండా 1800-1800- 1800 టోల్‌ ఫ్రీ నెంబర్‌లో కూడా సంప్రదించవచ్చు.

ఇక ఇంటి నుంచే మీరు ఫిర్యాదు చేయాలంటే కూడా ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌ గ్రీవెన్స్‌ పోర్టల్‌, CGRMS పోర్టల్‌లో కూడా కంప్లయింట్‌ చేయవచ్చు. మీ సమస్య ఏంటి? అనేది స్పష్టంగా ఉండాలి. అప్పుడే సమయానికి సంబంధిత అధికారులు స్పందిస్తారు.

Read Also: పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్‌లో పడలేదా? కేంద్రం తెచ్చిన 'భారతీ' యాప్‌తో ఒక్క క్లిక్‌తో పరిష్కారం!

Read Also: అక్టోబర్ 30న పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు విడుదల! ఎవరికి వస్తాయి? ఎవరు అనర్హులు? వివరాలివే!

అయితే, ఏదైనా ఫిర్యాదు చేసే ముందు మీ సమస్యను క్లియర్‌గా, సింపుల్‌ లాంగ్వేజ్‌లో సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీ ఆయుష్మాన్‌ కార్డు వివరాలు, బెనిఫిషియరీ వివరాలు కూడా తప్పనిసరి. ఏదైనా ఆసుపత్రి మీకు చికిత్స అందించడానికి నిరాకరిస్తే హస్పిటల్ పేరు కూడా తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇక ఫిర్యాదు చేసిన రిఫరెన్స్‌ నెంబర్‌ కూడా భద్రపరచుకోవాలి. సాధారణంగా ఫిర్యాదులు చికిత్స, బెనిఫిట్‌ తీసుకోవడం వల్ల సమస్యు, అర్హత, క్యాష్‌లెస్‌ ట్రీట్మెంట్‌ సంబంధించి ఉంటాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES