Uttar Pradesh: కట్టుకున్న భార్యను కుర్చీకి కట్టేసి సజీవ దహనం.. యూపీలో బైటపడ్డ ఘోరం..
Husband burn wife alive in up: భార్య మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకుని రోజు గొడవపడేవాడు.ఈ క్రమంలో ఆమెను కుర్చికి కట్టేసి నిప్పంటించాడు. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన పెను విషాదంగా మారింది.
Man ties wife to chair and burns alive in uttar Pradesh: సమాజంలో ఇటీవల కొంత మంది భార్యభర్తలు మరీ ఘోరంగా తయారయ్యారు. పెళ్లి అనే పవిత్ర బంధానికి మాయని మచ్చగా మారుతున్నారు. చక్కగా పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉండాల్సింది పోయి ఒకరిపై మరోకరు హత్యలకు కుట్రలు చేసుకుంటున్నారు. చిన్న గొడవలను పెద్దది చేసుకొని కట్టుకున్న వారిని సుపారీలు ఇచ్చి మరీ హతమారుస్తున్నారు. ఈ క్రమంలో వివాహేతరం సంబంధాలు, ఆర్థిక పర విషయాల్లో గొడవలతో నిత్యం భార్యభర్తల దారుణ ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. యూపీలోని కన్నౌజ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలోని చిబ్రమౌ పీఎస్ పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. జగత్ పూర్ గ్రామంలో 11 ఏళ్ల క్రితం సుఖ్బీర్ సింగ్ అలియాస్ మోను(35), సోనమ్‌లకు పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే మోను హర్యానాలోని హిసార్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతగాడి భార్య సోనమ్ జగత్‌పూర్ గ్రామంలోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఇటీవల మోను గ్రామానికి తిరిగి రాగా.. భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు.
అప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెతో నిత్యం గొడవలు పడేవాడు. ఆమె ఎన్నిసార్లు చెప్పిన కూడా మోను విన్పించుకునే వాడు. ఈ క్రమంలోనే.. మోను తీవ్ర కోపాద్రిక్తుడై సోనమ్‌తో గొడవకు దిగాడు. మాటా మాటా పెరగడంతో ఆమెను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పింటించి అక్కడి నుంచి పారిపోయాడు. ఇల్లంతా మంటలు వ్యాపించాయి.
ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని పారిపోయాడు. మంటలను చూసిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికు మంటలు ఇల్లంతా వ్యాపించాయి. మంటల్ని ఆర్పేందుకు గంటన్నర సమయం పట్టింది. దీంతో ఇంట్లో కుర్చీలో ఎముకల గూడుగా మారిన సోనమ్ ను స్థానికులు గుర్తించారు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై విచారణ చేపట్టగా భర్త మోను తరచుగా భార్యపై అనుమంతో వేధించేవాడని, అతగాడు ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.